వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌ కోసం చిరు రీ ఎంట్రీ- త్వరలో రాబోతున్నారు- జనసేన నేత నాదెండ్ల సంచలన కామెంట్స్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వీటిని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా త్వరలో ఆయన అన్నయ్య, మెగాస్టార్‌ చిరంజీవి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ నాదెండ్ల చేసిన కామెంట్స్‌ కలకలం రేపాయి.

 మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి ?

మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి ?

2014 ఎన్నికలకు ముందే రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ తర్వాత సినిమాలకే పరిమితం అయ్యారు. రాజకీయాల్లోకి రావాలని కొంతకాలంగా పలువురు నేతలు ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేసినా ఆయన అంగీకరించలేదు. కానీ తాజాగా ఆయన రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా అన్న చర్చ సాగుతోంది. దీనికి కొనసాగింపుగా ఇవాళ జనసేన సీనియర్‌ నేత, అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీని బలపరిచేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి.

 చిరు రీ ఎంట్రీపై నాదెండ్ల కామెంట్స్‌

చిరు రీ ఎంట్రీపై నాదెండ్ల కామెంట్స్‌

పంచాయతీ ఎన్నికల కోసం విజయవాడలో నిర్వహించిన జనసేన కార్యకర్తల భేటీలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ పవన్‌ కళ్యాణ్‌ వెంట చిరంజీవి రాబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు చిరు అండగా ఉంటానని హామీ ఇచ్చారని నాదెండ్ల కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. మామూలుగా వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే జనసేన నేత మనోహర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. దీంతో చిరు ఈ ఎంట్రీపై కలకలం రేగుతోంది.

 పవన్‌కు చిరు నైతిక మద్దతు...

పవన్‌కు చిరు నైతిక మద్దతు...

త్వరలో పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి రాబోతున్నారని చెప్పిన నాదెండ్ల మనోహర్‌.. అదే క్రమంలో పవన్‌కు చిరు నైతిక మద్దతు ఉంటుందన్నారు. ఈ మధ్య ఆయన్ను కలిసి నప్పుడు ఇదే విషయం చెప్పారని నాదెండ్ల కార్యకర్తలకు వెల్లడించారు. అయితే నాదెండ్ల వ్యాఖ్యలు చిరు రీ ఎంట్రీని సూచిస్తున్నాయా లేక పంచాయతీ ఎన్నికల వేళ పార్టీ కార్యకర్తల్లో స్ధైర్యం నింపేందుకు చేసినవా అన్నవి ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఏ ఉద్దేశంతో మాట్లాడినా చిరంజీవి కుటుంబం గురించి నాదెండ్ల ఏ సంకేతం లేకుండా రీ ఎంట్రీ వ్యాఖ్యలు చేయరన్న చర్చా జరుగుతోంది.

Recommended Video

AP Panchayat Elections Candidates Eligibility పోటీ చేయాలంటే అర్హతలు ఏంటి?.. అర్హులు, అనర్హులు ఎవరు?.

English summary
janasena senior leader nadendla manohar made sensational comments on chiranjeevi's re entry into politics. nadendla says that chiru will come in support of pawan kalyan soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X