రామ్ చరణ్-ఉపాసన నిర్ణయానికి మెగా ఫ్యామిలీ ఫిదా!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో సంస్థల యండి ఉపాసన త్వరలో ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. పెళ్లయి 11 ఏళ్ళ తర్వాత మొదటి బిడ్డకు స్వాగతం పలికిన ఈ జంట తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం మెగా ఫ్యామిలీ ఫిదా అయ్యేలా చేసింది.
సాధారణంగా ఎక్కడైనా పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత అత్తగారింటిని వదిలి వేరే కాపురం పెడతారు. అయితే ఇక్కడ రామ్ చరణ్, ఉపాసనలు మాత్రం ఇంతకాలం వేరే ఇంట్లో ఉండి, డెలివరీకి సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రామ్ చరణ్, నేను త్వరలోనే అత్తమామల దగ్గరకు షిఫ్ట్ అవుతున్నాం అంటూ పేర్కొన్న ఉపాసన నేను, రాం చరణ్ ఈ స్థాయికి చేరుకున్నాం అంటే అది మా గ్రాండ్ పేరెంట్స్ పంచిన ప్రేమ వల్లేనని స్పష్టం చేశారు.
అటువంటి ప్రేమను నా బిడ్డకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను అని ఉపాసన తెలిపారు. సాధారణంగా ఎవరైనా దంపతులకు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడతారు కానీ మేము దానికి పూర్తిగా భిన్నం అంటూ ఉపాసన తెలిపారు. ఇప్పుడు మేమిద్దరం అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని నవ్వుతూ చెప్పారు ఉపాసన. త్వరలోనే షిఫ్ట్ అవుతామన్నారు,
దీంతో మెగా ఫ్యామిలీ తో పాటు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సైతం ఉపాసన తీసుకున్న నిర్ణయానికి సంబరపడుతున్నారు. మెగా ఫ్యామిలీలో మరో తరం అడుగు పెడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి కనిపిస్తుంది. ఏది ఏమైనా గ్రాండ్ పేరెంట్స్ తో ఉండాలనుకోవడం, తన బిడ్డకు వారి ప్రేమను పంచుతూ, విలువలతో పెంచాలనుకోవడం వంటి అంశాలతో మెగా కోడలు ఉపాసన అందరి మన్ననలు పొందుతున్నారు.












Click it and Unblock the Notifications