Chiranjeevi : జగన్ సర్కార్ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు...
ఒకప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ వచ్చి సీఎం జగన్ ను కలిసి అభినందించకపోయినా తాను చొరవ తీసుకుని ఆయన్ను కలిసిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై మిగతా హీరోలతో కలిసి, నిర్మాతలు, పరిశ్రమ పెద్దలతో కలిసి, తాను ఒంటరిగా కూడా వచ్చి జగన్ ను కలిసిన చిరంజీవి కొంతకాలంగా మాత్రం దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్‍లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రభుత్వ తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.

ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టిపెట్టాలంటూ జగన్ సర్కార్ కు చిరంజీవి సూచించారు. ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఒకప్పుడు సీఎం జగన్ వద్ద చేతులు జోడించి కూర్చుకున్న చిరంజీవేనే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి సీఎం జగన్ తో చిరంజీవి చివరి భేటీ ఇతర స్టార్ హీరోలతో కలిసి జరిగింది. ఇందులో చిరంజీవిని సీఎం జగన్ అవమానించారంటూ ఆయన అభిమానులు, జనసేన నేతలు కూడా మండిపడ్డారు. ఆ తర్వాత చిరంజీవి తాను తమ్ముడు పవన్ కే అండగా ఉంటానంటూ ఓ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసింది. తాజాగా వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరు వ్యాఖ్యలు ఆయన గమ్యం ఏంటో చెప్పేశాయి. అయితే గతంలో జగన్ ను పదే పదే కలిసిన చిరంజీవిని ఆకాశానికెత్తేసిన వైసీపీ ఇప్పుడు ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications