‘పద్మ విభూషణ్’ చిరంజీవి, మోదీ, అమిత్ షా, మెగా ఫ్యామిలీ హాజరు, మెగాస్టార్ అభిమానులకు పండగ !

తెలుగు సినీ ప్రస్థానంలో నాలుగు దశాభ్దాలుగా మగుటం లేని మహారాజుగా కొనసాగి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురాస్కారం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. చిరంజీవి పద్మ విభాషణ్ అవార్డు అందుకోవడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో గురువారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు మెగాస్టార్ కు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడంతో దేశ విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన, కుటుంబ సభ్యులు హాజరైనారు.

Megastar Chiranjeevi was awarded Padma Vibhushan by President Draudi Murmu

రిపబ్లిక్ డే రోజు దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 132 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఏప్రిల్ 22వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడితో పాటు పలువురికి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందించారు. ఆ రోజు పద్మ అవార్డుల మొదటి విడత పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రం జరిగింది.

పద్మ అవార్డుల ప్రధానోత్సవం రెండో విడత కార్యక్రమం ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు సీనియర్ నటీమణి, ప్రముఖ నృత్యకారిణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో పాటు పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖుల కుటుంబ సభ్యులు హాజరైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+