హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్: ఆంటోనీ రిపోర్ట్‌పై అసద్ అసంతృప్తి, చిరుపైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

MIM opposes proposal of Hyderabad as UT
హైదరాబాద్: రాజధాని హైదరాబాదు నగరంపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను అంగీకరించేది లేదని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ సోమవారం స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని విషయమై ఆంటోనీ కమిటీ తన నివేదికలో పొందుపరిచినట్టు చెబుతున్న అంశాలపై ఒవైసీ సోమవారమిక్కడ తీవ్రంగా స్పందించారు.

హెచ్ఎండిఏ పరిధిని ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తూ శాంతి భద్రతలు, రెవెన్యూ, భూపరిపాలన పరమైన అధికారాలను కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకునేందుకు గవర్నర్ పరిధిలో ఉంచాలనే ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాద్ ప్రజలు అంగీకరించరని తేల్చి చెప్పారు. కమిటీ నివేదికను, విజయకుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్సు నివేది కలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఉమ్మడి రాజధానిని కేవలం ఖైరతాబాద్ మండలానికి పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు రక్షణ పేరుతో శాంతి భద్రతలను కేంద్ర పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నవారు నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, మెదక్ తదితర జిల్లాల్లో స్థిరపడిన సీమాంధ్రులకు రక్షణ కల్పించే విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.

అవసరమైతే హైదరాబాద్‌లోని సీమాంధ్రులను భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలుగా పరిగణించి రక్షణ కల్పించాలని సూచించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ఇతర సీమాంధ్ర నేతల పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు.

English summary

 The MIM has strongly opposed the idea of making Hyderabad a Union Territory on the lines of Chandigarh, in the event of bifurcation of AP even as the party again made a strong pitch for a unified state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X