జగన్ పై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో సమావేశమైన జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసారు. చంద్రబాబు మిర్చి రైతులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. సచివాలయం నుంచి ఎంత దూరం ఉంద ని.. ఇప్పటి వరకు యార్డుకు రాలేదని నిలదీసారు. రైతుల సమస్యలను పరిష్కరించుకుంటే తమ కు ఉద్యమం తప్పదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు. జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు.

జగన్ అందుకే ఓడించారు
మాజీ ముఖ్యమంత్రి పై అచ్చెన్న మండిపడ్డారు. జగన్‌ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని చెప్పు కొచ్చారు. జగన్ వహరిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉందని వ్యాఖ్యానించారు. మిర్చికి మద్దతు ధర పెడితే అంతకు మించిన ధర రాదని చెప్పుకొచ్చారు. రైతుకు ఎక్కువ మేలు చేయాలనేదే మా ప్రయత్నంగా వివరించారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని చంద్రబాబు కలుస్తారని అచ్చెన్న వెల్లడించారు. నిజమయిన నాయకు డు అయితే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేయాలని అచ్చెన్న వ్యాఖ్యానించారు. జగన్ ను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు.

Minister Achamnaidu seriously Reacts over YS Jagan Allegations over Mirchi farmers issues

నిర్లక్ష్యం చేసారు
గెలుపు ఓటములు సహజమని చెప్పిన అచ్చెన్న, ఓడిన తరువాత అందుకు కారణాలను సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పరిస్ధితి చూస్తుంటే, ఆయన మాటలు వింటుంటూ ఆయనకు మానసిక స్ధితి సరిగా లేనట్టు మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. రైతు దీనా వస్ధలో ఉన్నాడు, పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదు అని పచ్చి అబద్దాలు ఆడుతున్నారని చెప్పుకొచ్చారు. అయిదు సంవత్సరాలు రైతు గురించి ఇది చేసాను అని చెప్పగలవా అని జగన్ ను ప్రశ్నించారు. సాయిల్ టెస్టింగ్ ఒక్కిరికి అయినా చేసి ఒక్క కార్డు అయినా ఇవ్వగలిగావా అంటూ నిలదీసారు. అయిదు సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని మెకనైజేషన్ కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

ఢిల్లీతో సంప్రదింపులు
ప్రధాన పంట వరి విషయంలో నెలల తరబడి రైతులకు బకాయి పెట్టారని అచ్చెన్న చెప్పుకొ చ్చారు. రూ 1600 కోట్లు బకాయిలు పెట్టారని విమర్శించారు. మార్కెట్ లో ధర తక్కవ ఉన్న సమయం లో మాత్రమే ప్రభుత్వం ఇంటర్వీన్ అవుతుందన్నారు. రైతుకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. అనునిత్యం కేంద్రంతో సంప్రదించి మిర్చి విషయంలో నిన్న కూడా సిఎం ఓలేఖ రాసారని చెప్పారు. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసు కొంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఈ సమస్య పైన కేంద్రంతో చర్చిస్తారని అచ్చెన్నాయుడు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+