తెలుగు అకాడమీ తెలుగుదేశం పార్టీ అకాడమీ కాదు.. రాద్దాంతం ఆపండి : మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో మొదలైన రచ్చ కొనసాగుతూనే ఉంది. తెలుగు అకాడమీని తెలుగు అకాడమీ గానే కొనసాగించాలని టిడిపి నేతలు పేరు మార్చవలసిన అవసరం ఏముందని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉండగా, పేరు మార్చడం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పాలని వైసీపీ నేతలు టిడిపి నేతలకు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు.

ఇటీవల చంద్రబాబు నాయుడు తెలుగు అకాడమీ తెలుగు దేశం అకాడమీ అనుకున్నారేమో అందుకే పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ వ్యాఖ్యలు చేయడంతో, తాజాగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీ పేరుతో జీవో జారీ చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.ద్రవిడ భాష నుంచి ఆవిర్భవించిన తెలుగులో పరిశోధన కోసమే సంస్కృతాన్ని జోడించి అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

Minister Adimulapu Suresh slams tdp, said Telugu Academy is not Telugudesam Party Academy

తెలుగు అకాడమీ అంటే తెలుగుదేశం పార్టీ అకాడమీ కాదని టీడీపీ నేతలు గుర్తించాలని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. టిడిపి నేతలు తమ విమర్శలను సరి చేసుకోవాలని సురేష్ హితవు పలికారు. తెలుగు భాషాభివృద్ధి మరింత విస్తృతం చేయడం కోసం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్తిత్వాన్ని కోల్పోయిందని విమర్శించారు.తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత కూడా తెలుగు అకాడమీ ఏర్పాటులో గత సర్కారు మీనమేషాలు లెక్కించింది అని, ప్రస్తుత సర్కార్ తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.

తెలుగు భాష మూలాలను తెలుసుకోవాలంటే భారతీయ భాషలకు మూలమైన సంస్కృతాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుపై సంస్కృతం ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రెండింటిని వేర్వేరు భాషలుగా చూడలేమని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రతిదానికి రాద్ధాంతం చేయడం అలవాటు చేసుకున్న టిడిపి నేతలు ఇప్పటికైనా మారాలి అని హితవు పలికారు. అకాడమీ విషయంలో అనవసరపు రాద్ధాంతం మానుకోవాలని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+