పులి పిల్లకు జగన్ పేరు పెట్టిన ఏపీ మంత్రి : మరో నాలుగు వైట్ టైగర్స్ కు ఇలా..!
ఏపీ ప్రభుత్వంలోని అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అయిదు పులి పిల్లలకు పేర్లు ఖరారు చేసారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూ పార్కులో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. జూ పార్క్ లోని
తెల్ల పులులు సమీర్, రాణిలకు పుట్టిన సంతానానికి పేర్లు ఖరారు చేయాల్సిందిగా అధికారులు మంత్రిని కోరారు. ఆయన వెంటనే వాటికి నామకరణం చేసారు. మూడు మగ పులి పిల్లలకు వాసు.. సిద్దాన్ అనే పేర్లతో పాటుగా మూడో మగ పులి పిల్లకు జగన్ అనే పేరు ప్రకటించారు. దీంతో..ఒక్క సారిగా అక్కడ ఉన్న వారంతా మంత్రి వైపు ఆసక్తిగా చూసారు.
ఇక..ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గ అనే పేర్లు పెట్టారు. మంత్రికి ఆ పులి పిల్లలకు పేర్లు పెట్టాల్సి ఉంటుందని అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో..ఆయన ఈ పేర్లను ముందుగానే నిర్ణయించకొని వచ్చారా లేక అక్కడికక్కడే ఖరారు చేసారా అనే చర్చ కూడా జరిగింది. అయితే..మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మగ పులి పిల్లల్లో ఒక్క దానికి జగన్ అనే పేరు పెట్టటం ద్వారా ఆయన ఏం చెప్పదలచుకున్నారనేది ఇప్పుడు చర్చ. తాను అమితంగా అభిమానించే తమ అధినేత పేరు పెట్టి అభిమానం చాటుకున్నారా..లేక.. యాధ్రుచ్చికంగా ఇది జరిగిందా అనేది ఆసక్తి కరంగా చర్చించుకుంటున్నారు.

మంత్రి బాలినేని శ్రీనివాస్ శాఖా పరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తిరుపతి చేరుకున్నారు. అక్కడ ఉన్న జూ పార్క్ ను సందర్శించారు. ఆ సమయంలో ఈ పులి పిల్లలకు ఈ పేర్లు ఖరారు చేసారు. జగన్ అభిమానులు ఆయన్ను అభిమానంతో పులి వెందుల పులి బిడ్డ అని పిలుస్తూ ఉంటారు. అయితే.. ఇప్పుడు మిగిలిన పేర్లలో ఒక దానికి వాసు అనే పేరు పెట్టారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ ను సైతం తెలిసిన వారు..పార్టీలోని ముఖ్యులు వాసు అనే పిలుస్తారు. దీంతో..రెండు మగ పిల్లలకు ఆయన తన పేరుతో పాటుగా జగన్ పేరు పెట్టారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే...ఈ వ్యవహారం మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది. గతంలో జగన్ కోసం బాలినేని తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసారు. తొలి నుండి వైయస్ కుటుంబంతో బంధుత్వం ఉండటం..జగన్ పైన అభిమానంతో ఆయన జగన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుండి ఆయనతోనే ఉన్నారు. ఇక, ఇప్పుడు మంత్రి పులి పిల్లలకు పెట్టిన పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, శాఖా పరంగా సమీక్షించిన మంత్రి వచ్చే జనవరిలో అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని..అదే విధంగా సిబ్బంది వాహనాల కోసం రూ 40 కోట్లు ఇప్పటికే కేటాయించామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications