వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ రగడ : హవాలా కింగ్ అంటూ రచ్చ; బాలినేని ఏమ్మన్నారంటే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో వైసీపీ నేతలు, వైసిపి మంత్రులపై విమర్శలు వెల్లువగా మారుతున్నాయి. వైసిపి నేతలు, మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు తాజాగా వైసీపీ మంత్రులు, వైసీపీ నేతల జల్సాలు, విలాసాలు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల కుప్పగా ఉంటే ఆ సమస్యలను పరిష్కరించకుండా అధికార వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు .

SamanthaAkkineni: స్మైలీ బ్యూటీ సామ్ ఇంట హాట్ గా ఎపుడు చూసి ఉండరు (ఫొటోస్)

బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ పై రాజకీయ దుమారం

బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ పై రాజకీయ దుమారం

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ ఇప్పుడు రాజకీయ దుమారంగా మారింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రైవేట్ జెట్ విమానంలో విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయ విమర్శలకు కారణంగా మారింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పది మంది సన్నిహితులతో కలిసి రష్యా వెళ్లారు. ఆయన పర్యటన అధికారిక పర్యటనా, వ్యక్తిగత పర్యటనా అన్న చర్చ ఆయన పోస్ట్ చేసిన ఫోటోలతో మొదలైంది. అయితే బాలినేని రష్యా వెళ్లిన విమానం చాలా విలాసవంతమైన విమానం కావడంతో రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతున్నారని మంత్రి గారి పర్యటనను టార్గెట్ చేస్తోంది టిడిపి.

మంత్రి బాలినేని హవాలా కింగ్ అంటూ టీడీపీ ధ్వజం

మంత్రి బాలినేని హవాలా కింగ్ అంటూ టీడీపీ ధ్వజం

సోషల్ మీడియా వేదికగా మంత్రి బాలినేని హవాలా కింగ్ అంటూ, అక్రమ సంపాదనతోనే మంత్రి బాలినేని ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది .వ్యక్తిగత ఫ్లైట్లో రష్యాకు వెళ్లడం అంటే సుమారు 5 కోట్ల మేర ఫ్లైట్ కే ఖర్చు అవుతుందని, ఏకంగా వ్యక్తిగతంగా ఒక ఫ్లైట్ నే బుక్ చేసుకున్నారు అంటే బాలినేని సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో నాయకులు తిరగడానికి ప్రత్యేక విమానాలు, ప్రజలు తిరగడానికి గుంతల రోడ్లు అంటూ తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వానికి చురకలు వేస్తుంది. వైసిపి నాయకులు గాల్లో తప్ప కిందకు దిగటం లేదని పుట్టినరోజు వేడుకలు దగ్గర నుండి విదేశాల వెళ్లే వరకు కోట్లు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్ లలో జల్సాలు చేస్తున్నారని టీడీపీ నేతల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 సోషల్ మీడియాలో బాలినేని టూర్ పై రచ్చ

సోషల్ మీడియాలో బాలినేని టూర్ పై రచ్చ

తాజాగా హవాలా డబ్బుతో 5 కోట్లు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్ లో రష్యాలో సేదతీరడానికి హవాలా కింగ్ బాలినేని వెళ్ళారని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో దోచుకున్న డబ్బుతో, వచ్చిపడిన అధికారంతో వైసీపీ నేతల విచ్చలవిడితనానికి అంతు లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలు రోడ్డు వేయమని అడిగినా, పెన్షన్లు పెంచాలని అడిగినా డబ్బులు లేవు అంటున్నారని, కానీ వాళ్ల జల్సాలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అడ్డురాదు అంటూ విమర్శిస్తున్నారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైసిపి మంత్రుల జల్సాలు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు .

రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లలో తిరగడం దేనికి : టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు

రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లలో తిరగడం దేనికి : టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఓ పక్కన అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లలో తిరగడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. అక్రమ సంపాదనతోనే , హవాలా సొమ్ముతోనే బాలినేని శ్రీనివాసరెడ్డి జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో సొంత కారు కూడా లేదని పేర్కొన్నారని కానీ ఇప్పుడు రష్యాకు ప్రైవేట్ ఫ్లైట్ లో దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ప్రయాణం చేశారని హవాలా కింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

మంత్రులు విలాసాలలో మునిగి తేలుతున్నారు: సీపీఐ నేత రామకృష్ణ

మంత్రులు విలాసాలలో మునిగి తేలుతున్నారు: సీపీఐ నేత రామకృష్ణ

సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా మంత్రి బాలినేని శ్రీనివాస్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో పెన్షన్లు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మంత్రులు విలాసాలలో మునిగి తేలుతున్నారని రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రుల తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బళ్లారి ఏరియాలో గాలి జనార్దన్ రెడ్డి ఏ విధంగా మైన్స్ ను కొల్లగొట్టాడో అదేవిధంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి అడ్డాగా మంత్రి బాలినేని గనులను కొల్లగొట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం నిత్యం అప్పులు చేస్తూ, ప్రజలపై రోజుకో రకమైన భారాలు మోపుతూ, రాష్ట్రం అప్పులపాలు అయిందని చెబుతుందని మండిపడ్డారు. ఇక మంత్రుల వ్యవహారశైలి ఈ విధంగా ఉందని అసహనం వ్యక్తం చేసిన సిపిఐ నేత రామకృష్ణ మంత్రుల జల్సాలపై ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Recommended Video

ప్రధాని మోదీ విధానాలపై మండి పడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే
వ్యక్తిగతమని స్పందించిన బాలినేని .. టీడీపీ ఎమ్మెల్యే కూడా తనతో ఉన్నాడని వ్యాఖ్యలు

వ్యక్తిగతమని స్పందించిన బాలినేని .. టీడీపీ ఎమ్మెల్యే కూడా తనతో ఉన్నాడని వ్యాఖ్యలు

ఇక మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన రష్యా టూర్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్పందించారు. రష్యా టూర్ తన వ్యక్తిగతమని,అధికారిక టూర్ కాదని, స్నేహితులతో కలిసి వచ్చానని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. వ్యక్తిగత పర్యటనలపై రాద్ధాంతం చేయడమేమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ప్రతీది రాజకీయం చేయడం అలవాటు అయిందని విమర్శించారు.

English summary
Andhra Pradesh Minister Balineni Srinivas Reddy's Russia tour has now become a political controversy. Minister Balineni Srinivasareddy's foreign tour on a private jet has become a source of political criticism. While TDP leader Kalva Srinivasulu and tdp in social media has criticized the as hawala king, illegal earnings of Balineni, CPI leader Ramakrishna said the government should respond to these luxuries. Minister Balineni responded that he had gone on a personal visit and tdp is politicizing the personal tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X