జగన్‌కు గంటా సవాల్, హుధుద్‌లా దేశంలో వస్తే చంద్రబాబునే పిలుస్తారు: బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: హుధుద్ తుఫాను సమయంలో జ్వరం వచ్చి పడుకున్నాడన్న వైసీపీ అధ్యక్షులు జగన్ శుక్రవారం నాడు సభలో చేసిన వ్యాఖ్యలకు గంటా అదే సభలో స్పందించారు. జగన్ సూటిగా అంటూ ప్రశ్నలు బాగానే అడిగారని, కానీ తాము ఇరవై అయిదు ప్రశ్నలు అడిగామని, ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. ఇద్దరం రాజీనామా చేసి మాట్లాడుకుందామన్నారు. ఇద్దరం భీమిలిలో పోటీ చేద్దామన్నారు.
హుధుద్ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. చంద్రబాబు చెబితే ప్రజలు దీపావళి కూడా చేసుకోలేదన్నారు. ప్రతిక్షణం అఫ్రమత్తంగా ఉండి చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంత్రివర్గమంతా అక్కడ ఉండి పరిస్థితినీ సమీక్షించిందని, చంద్రబాబు ఓ విజన్ ఉన్న ముఖ్యమంత్రి అన్నారు.
చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశంసలు

హుధుద్ తుఫాను విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘాటుగా స్పందించారు. గంటా ఇంటిలో పడుకోలేదని, ఆయన, తను విశాఖ బీచ్ రోడ్డులో అర్ధరాత్రి కూడా ఉన్నామన్నారు. ఆ సమయంలో ఆయన అక్కడున్న వారిని పోలీసుల చేత బలవంతంగా ఖాళీ చేయించారని, అప్పుడు తనకు కోపం వచ్చిందని, కానీ హుధుద్ తుఫాను వచ్చాక చాలామంది ప్రాణాలతో బయటపడ్డారన్నారు.
చంద్రబాబు పింఛన్‌ను ఐదు రెట్లు పెంచారని, హుధుద్ తుఫాను నేపథ్యంలో చంద్రబాబు చర్యలతో ఆయన పైన తనకు ఐదు రెట్లు గౌరవం పెరిగిందన్నారు. చంద్రబాబు బ్రహ్మాండంగా పని చేశారని, ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఇక నుండి దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి విపత్తులు జరిగితే చంద్రబాబును పిలిచేలా ఆదర్శవంతంగా పని చేశారన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఇలాంటి విపత్తులు వస్తే ప్రపంచంలో అందరు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటారన్నారు. చాలామంది పార్టీలకు అతీతంగా హుధుద్ సమయంలో పని చేశారన్నారు. కొందరు వైసీపీ నేతలు కూడా తనకు సహకారంగా వచ్చారని చెప్పారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు అద్భుతంగా పని చేశారని, ఎలాంటి అనుమానం లేదన్నారు. విశాఖ ఇంత త్వరగా కోలుకుందంటే అందుకు చంద్రబాబే కారణమన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి.. ఎలాగైనా విమర్శించాలని అలా మాట్లాడుతోంది తప్పితే, మనస్ఫూర్తిగా కాదన్నారు. ఎక్కడైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకోవచ్చునని, సహాయం కోసం కొన్ని పేర్లు మిస్ అయ్యాయని, వాటిని కలిపితే సరిపోతుందన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఐదు రోజుల్లో అరవై వేల విద్యుత్ స్తంభాలు సరి చేసి ఇచ్చామని, ఇంటింటికి ఆహార పొట్లాలు అందేలా చూశామన్నారు. మరో మంత్రి మృణాళిని మాట్లాడుతూ.. ఆ రోజు తీసుకున్న చర్యలను వివరించారు.
అంతకుముందు మంత్రి రావెల కిషోర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, రాష్ట్ర విభజనను అడ్డగోలుగా చేసిందని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాలను వైయస్ మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధుల్ని దారి మళ్లించారని దుయ్యబట్టారు. ప్రజల సంపదను దోచుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఎప్పుడు జైలుకు వెళతారో చెప్పలేమని, అలాంటిది మీరు చంద్రబాబును విమర్శించే హక్కు లేదన్నారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం జరగగా వాస్తవాలు వినే ఓపిక ఉండాలని మంత్రి కోరారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ జోక్యం చేసుకుని సభ్యులకు సర్దిచెప్పారు. కాగా, సభ శనివారానికి వాయిదా పడింది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications