మురికి మాటలెందుకు మెగాస్టార్..!!

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు.. ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్నారు.

ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. చిరంజీవికి ఘాటుగా బదులిచ్చారు. రియల్ లైఫ్‌కు రీల్ లైఫ్‌కు తేడా తెలుసుకోవాలంటూ చురకలు అంటించారు. రెమ్యునరేషన్ విషయంలో తాము ఇతర హీరోల గురించి ఏరోజూ ప్రశ్నించలేదని, సీనియర్ మంత్రి అంబటి రాంబాబును కించపరిచేలా బ్రో సినిమాలో పాత్రను పెట్టొచ్చా? అంటూ నిలదీశారు.

Minister Gudivada Amarnath slams Megastar Chiranjeevi

తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. స్పందించారు. చిరంజీవిపై ఘాటు విమర్శలు చేశారు. సినిమాను సినిమాగా చూడాలని చెబుతున్న మెగా ఫ్యామిలీ హీరోలు.. సినిమాను సినిమాగా ఎందుకు తీయట్లేదంటూ ప్రశ్నించారు. అంబటి రాంబాబును కించపరిచేలా సీన్లను ఎందుకు పెట్టాల్సి వచ్చిందని, దీనికి సమాధానం చెప్పాలంటూ మెగాస్టార్‌ను నిలదీశారు.

అవసరం లేకపోయినా బ్రో సినిమాలో అంబటి రాంబాబు స్కూఫ్ సన్నివేశాన్ని పెట్టారని విమర్శించారు. సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దనేది వారే.. రాజకీయాల గురించి సినిమాలో ప్రస్తావనకు తీసుకొచ్చేదీ వారేనంటూ పవన్ కల్యాణ్, చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు గుడివాడ అమర్‌నాథ్.

సినిమాను సినిమాగా చూడాలంటూ ప్రభుత్వాని చెప్పడం కంటే ముందు వాళ్ల తమ్ముడికి ఎందుకు చెప్పలేదని అన్నారు. మురికి మాటలు మాట్లాడే పవన్ కల్యాణ్ నోటిని కడుగుతారో.. లేక ఒంటిని కడుగుతారో.. ఇంకేమైనా కడుగుతారో.. అది చిరంజీవి ఇష్టమని, దాని తరువాత బయటి వారికి చెప్పాలని గుడివాడ మెగాస్టార్‌కు హితబోధ చేశారు. చిరంజీవి అంటే తనకు ప్రత్యేక గౌరవమని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+