Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా? ఇదేనా జనసైనికులకు ఇచ్చే సందేశం: మంత్రి కారుమూరి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు మూకుమ్మడిగా దాడి మొదలుపెట్టారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనతో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై, వైసిపి మంత్రులపై గతంలో ఎన్నడూ లేని విధంగా విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో మాటల దాడి చేస్తున్న మంత్రులు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ జనసైనికులకు ఏం సందేశం ఇస్తున్నారు? మంత్రి కారుమూరి

పవన్ కళ్యాణ్ జనసైనికులకు ఏం సందేశం ఇస్తున్నారు? మంత్రి కారుమూరి

తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కాల్ షీట్ ముగిసిపోయిందని, అందుకే పవన్ కళ్యాణ్ మళ్లీ హైదరాబాద్ వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. తంతా కొడతా అంటూ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్న ఆయన, జనసైనికులు విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా

పవన్ కళ్యాణ్ యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా

జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడితే, మంత్రి రోజా వెంట్రుకవాసిలో దాడి నుండి తప్పించుకున్నారని మంత్రి కారుమూరి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా అని ప్రశ్నించిన మంత్రి కారుమూరి, యువతకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి, దాడులు చేయమని రెచ్చగొడతారా అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నోటికొచ్చింది మాట్లాడితే తాట తీస్తా అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇప్పటి వరకు ఎంత మంది తాట తీశారో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సహకరించకపోతే జనవాణి నిర్వహించేవారా?

ప్రభుత్వం సహకరించకపోతే జనవాణి నిర్వహించేవారా?

తాము ప్రజా మద్దతుతో ఎన్నికయ్యామని, తమను కొడితే ప్రజలను కొట్టినట్టే అని మంత్రి కారుమూరి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని పేర్కొన్న ఆయన, సహకరించకపోతే పవన్ కళ్యాణ్ వీటిని ఎలా నిర్వహిస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్తపుత్రుడు

పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్తపుత్రుడు

చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ప్రజలపై దాడి చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజార్చారని చురకలంటించారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్తపుత్రుడు అన్న మాటలను ముమ్మాటికీ నిజం చేశారని మంత్రి కారుమూరి తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పవన్ కళ్యాణ్ ముసుగు తొలిగిపోయిందని, పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ఇదే నని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+