‘మంత్రిగారూ’: లోకేష్‌తో చంద్రబాబు ఇలా, అరగంట స్పీచ్‌తో ఆకట్టుకున్నారు
రాష్ట్ర ఉపాధి హామీ మండలిలో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్‌ను సంబోధించిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
అమరావతి: రాష్ట్ర ఉపాధి హామీ మండలిలో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్‌ను సంబోధించిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

మంత్రిగారూ
ఈ సమావేశంలో మంత్రులందరితో వ్యవహరించినట్టే నారా లోకేష్‌నూ గౌరవిస్తూ ‘మంత్రి గారూ' అంటూ సీఎం చంద్రబాబు తన తనయుడిని సంబోధించారు.
అంతేగాక, మంత్రిగా లోకేష్ పాల్గొన్న ఈ తొలి సమావేశంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

పెద్ద శాఖే
చంద్రబాబు చెప్పిన విషయాలను లోకేష్ ఓ నోట్ బుక్ లో రాసుకున్నారు. ఉపాధి హామీ అమల్లో ఇబ్బందులను జడ్పీ చైర్మన్లు ప్రస్తావించగా, ఆ సమస్యలను పరిష్కరించాలని లోకేష్‌ను చంద్రబాబు ఆదేశించారు. ‘పెద్ద శాఖ అనుకున్నా కానీ, చాలా లోతైన శాఖే. స్టడీ చేస్తా' అని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు.

అరగంట ప్రసంగం
ఈ సమావేశంలో సుమారు అరగంట పాటు లోకేష్ ప్రసంగించడం గమనార్హం. ఉపాధి హామీ అమలుపై సీఎం సూచనలు, ఆలోచనలను పొందుపరిచి నోట్ రూపొందించాల్సిందిగా అధికారులను లోకేష్ ఆదేశించారు.

ప్రత్యేక ఆకర్షణగా..
కాగా, ఉపాధి హామీ కూలీల వేసవి భృతి 30 శాతం పెంచుతున్నట్ల్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.12 వేల కోట్ల మేర ఉపాధి పనులకు ప్రణాళికలు సిద్దం చేయాలని, ఈ పనులు విజయవంతంగా నిర్వహించిన వారికి పురస్కారాలు అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. మొత్తానికి ఈ సమావేశంలో చంద్రబాబు, లోకేష్‌ల సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.












Click it and Unblock the Notifications