వరదముంపు వేళ.. నారా లోకేష్ సాహసోపేతం
Heavy rains in AP: ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12: 30 నుంచి 2:30 గంటల మధ్య తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడింది. అయినప్పటికీ- వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కృష్ణా, గుంటూరులను ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది. చెరువును తలపిస్తోంది. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
అటు ప్రకాశం బ్యారేజీ వరద ఉదృతి కొనసాగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా- అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తివేశారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం నుంచి పర్యటిస్తున్నాను. మంగళగిరి టౌన్ రత్నాల చెరువు ప్రాంతంలో
— Lokesh Nara (@naralokesh) September 1, 2024
ముంపు బాధితులతో మాట్లాడాను. ప్రభుత్వం తరపున అందించిన సాయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నాను. మసీదు లైన్లో చేనేత కార్మికుల ఇళ్లు పరిశీలించాను. ఇళ్ల మధ్య నిలిచిన… pic.twitter.com/fhuMADd79f
భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి నారా లోకేష్. బాధితులను కలిశారు. వారితో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు.
తాడేపల్లి నులకపేటలోని ముంపుకు గురైన క్వారీ ఏరియా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్#2024APFloodsRelief#LokeshInMangalagiri #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/o42UdqmuoW
— Telugu Desam Party (@JaiTDP) September 1, 2024
ఒకవంక తేలికపాటి జల్లులు పడుతున్నప్పటికీ బాధితులను పరామర్శించడంలో నారా లోకేష్ వెనుకంజ వేయలేదు. స్థానిక నాయకులతో కలిసి ముంపు గ్రామాలను సందర్శించారు. జలమయమైన వీధుల్లో కలియతిరిగారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ అక్కడికక్కడే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications