విజయవాడలో పరిస్థితి ఎలా ఉందంటే?, పక్కాప్లాన్ చేస్తున్నాము, మంత్రి
భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టులు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలో వరద నీరు దాదాపు తొలగించామని, ఆదివారం సాయంత్రం లోపు విజయవాడ నగరం సాధారణ స్థితికి వస్తుందని, ఇన్ని రోజులు ప్రభుత్వానికి సహకరించినందుకు ప్రజలకు పేరుపేరునా అందరికి ధన్యవాదాలు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ చెప్పారు.
శనివారం విజయవాడలోని జర్నలిస్టు కాలనీ, బోస్ నగర్, కండ్రిక తదితర ప్రాంతాల్లో మంత్రి నారాయణ స్కూటర్ నడుపుకుంటూ ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరంలో దాదాపుగా వరద నీరు తగ్గిపోయిందని, ఆదివారం సాయంత్రంలోపు నగరంలోని 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని,, వరద నీటితో ఇళ్లలో బురద పేరుకుపోయిందని చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారని మంత్రి నారాయణ అన్నారు.

నగరంలోని చాలా ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ పనులు చేపట్టామని, ఇళ్లలో వరద కారణంగా పేరుకుపోయిన బుదర మొత్తం తొలగించే బాధ్యత మాదే అని మంత్రి నారాయణ వివరించారు. విజయవాడలో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులు పరిశీలించడానికి మంత్రి నారాయణ స్వయంగా బైక్ నడుపుకుంటూ ఆ వీధుల్తో తిరిగి ప్రజలను పలకరించారు. స్థానిక ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అని మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు.

పలు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ జరగలేదని ఇదే సందర్బంలో స్థానిక ప్రజలు మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. అలాంటి చోట్ల మరోసారి ఎన్యుమరేషన్ చెయ్యాలని సంబంధిత అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు 100 రోడ్లు, నున్నటి రోడ్లు, సిమెంట్ల రోడ్లకు గండికొట్టామని మంత్రి నారాయణ అన్నారు. గండ్లు కొట్టిన రోడ్ల దగ్గర తాత్కాలికంగా పైప్ లైన్లు ఏర్పాటు చేసి వరద నీరు బయటకు పంపేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వివరించారు.












Click it and Unblock the Notifications