అందరికీ ఆదర్శంగా ఏపీ మంత్రి.. ఆయన వీడియోలు చూస్తే శభాష్ అనాల్సిందే!
చిన్న చిన్న పదవులలో ఉన్న వారే అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఈ పని నేను చేయాలా అని ఫీల్ అవుతున్న వారున్న రోజుల్లో ఒక రాష్ట్ర మంత్రి తనకు ఖాళీ దొరికినప్పుడల్లా సామాన్య రైతులా వ్యవసాయ పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంత్రిని అయితేనేం నేను రైతు బిడ్డనే అని అందరికీ గర్వంగా చెబుతున్నారు.
నిమ్మల రామానాయుడుకు మంచి గుర్తింపు
మంత్రి హోదాలో ఉన్న తాను సామాన్యుడినేనని చెబుతున్న ఏపీ మంత్రి ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మంత్రి కాకముందు ఎమ్మెల్యేగా కూడా నిమ్మల రామానాయుడుకి స్థానికంగా మంచి పేరుంది. ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుడిగా, వారి జీవితాలతో మమేకమయ్యే వ్యక్తిగా పాలకొల్లు నియోజకవర్గంలో ఎనలేని గుర్తింపు ఉంది.

పొలం బాట పట్టిన మంత్రి నిమ్మల
ఇక తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగ రోజు తన ఊర్లో పొలం బాట పట్టారు. క్షణం తీరిక లేకుండా రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న మంత్రి కాస్త సమయం దొరికితే చాలు పొలంలో ప్రత్యక్షమవుతారు. ఇదే క్రమంలో కనుమ పండుగ నాడు తన సొంతూరైన ఏలూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు తన పొలానికి వెళ్లి వరి చేనుకు పురుగుల మందు స్ప్రే చేశారు.
నిమ్మల పొలం పనుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
ఒక సామాన్య రైతులా పొలం పనులు చేస్తున్న ఆయనను చూసిన స్థానికులు చాలా సంబరపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పొలం పనులు చేసిన వీడియోలు, ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. మొదటినుంచి పొలం పనుల పట్ల ఆసక్తి చూపించే మంత్రి నిమ్మల రామానాయుడు గతంలో అధ్యాపకుడిగా పని చేస్తూనే వ్యవసాయం చేసేవారు. ఇటు వ్యవసాయంలోనే కాకుండా ఆక్వా సాగులో కూడా ఆయన తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు.
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా... కాలేజీ అధ్యాపకుడిగా పని చేస్తున్న నా సొంత గ్రామంలో వ్యవసాయం మాత్రం నేనే సొంతంగా చేస్తూ వరిలో ఎకరానికి 55 నుండి 60 బస్తాలు దిగుబడి సాధించడమే కాక ఆక్వా సాగులో కూడా మంచి ఫలితాలు సాధించే వాడిని. మంత్రిగా సమయం దొరకని స్థితిలో నేడు… pic.twitter.com/YGxrbktfY2
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) January 15, 2025
మంత్రిగా ఉన్నా వ్యవసాయ పనులు చేసిన నిమ్మల
నిమ్మల రామానాయుడు వ్యవసాయం చేసిన రోజుల్లో ఎకరానికి 55 నుంచి 60 బస్తాలు దిగుబడిని సాధించేవారు అంటే వ్యవసాయం పట్ల ఆయనకున్న మక్కువ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మంత్రిగా ఊపిరాడనంత బిజీలో ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు మాత్రం మర్చిపోకుండా చేయడం ఆయన గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందనే చెప్పాలి.
ఇదే తనకు నిజమైన సంతృప్తి అన్న నిమ్మల
ఇక కనుమ పండుగ సందర్భంగా నిన్న రైతుగా తన అనుభవాలను పంచుకున్న నిమ్మల రామానాయుడు తాను రైతు కూలీలతో కలిసి వరి చేనుకు మందు స్ప్రే చేయడం నిజమైన సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. రైతులందరూ పాడిపంటలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని సంక్రాంతి పర్వదినాన పంట గట్టుపై ఉండి కోరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఏది ఏమైనా మంత్రిగా బృహత్తరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఒక సామాన్య రైతులా పొలం పనులు చేస్తున్న నిమ్మల రామానాయుడు నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications