జగన్ ఎంత రెచ్చగొట్టినా ఇంతే, ఆ పరిస్థితి తేవద్దు: మంత్రి పత్తిపాటి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళారం నాడు మండిపడ్డారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళారం నాడు మండిపడ్డారు.

 Minister Pattipati warns YSRCP chief YS Jagan

జగన్‌ ఎంత రెచ్చగొట్టినా రాజధాని నిర్మాణం ఆగదని, భూసేకరణ ఆగదన్నారు. అలాగే అభివృద్ధి ఆగదని చెప్పారు. తొంబై ఎనిమిది శాతం మంది రైతులు రాజధానికి సహకరిస్తున్నారన్నారు.

అయినా అడ్డుకునేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారన్నారు. భూముల ధరలను కోల్పోయే పరిస్థితిని తీసుకురావద్దని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

కొనుగోలు కేంద్రాల్లోనే కంది పప్పు అమ్మాలి: పత్తిపాటి

కంది పంటకు రూ.5,050 మద్దతు ధర కల్పిస్తున్నామని పత్తిపాటి చెప్పారు. కంది కొనుగోలు కేంద్రాల్లోనే కందిపప్పును విక్రయించాలన్నారు. 20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, దళారులకు ధాన్యాన్ని విక్రయించవద్దని రైతులకు సూచించారు. ఇన్ పుట్ సబ్సిడీతో కలిపి బీమా సొమ్ము చెల్లిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+