ఈ టైమ్ లో నిబంధనలు, షరతులు అడ్డురాకూడదు, సీఎం చంద్రబాబు ఆర్డర్
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ప్రజల సమస్యలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ రాష్ట్ర మంత్రులు, తెలంగాణలో ఆ రాష్ట్ర మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లు వరద బాధితులకు ఆహారం, మంచినీళ్లు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వెంటనే సహాయం చేయడానికి ఎలాంటి షరతులు, పరిమితులు, నిబంధనలు లేకుండా ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులు అందరికి ఆదేశాలు జారీ చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి పయ్యావుల కేశవ్ వరద బాధితులకు వెంటనే న్యాయం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని అన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, మంత్రులు అందరికీ బాధ్యతలు అప్పగించారని, జిల్లా కలెక్టర్లతో కలిసి సమన్వయంతో మేము పనిచేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
విజయవాడలో గత ఐదు సంవత్సరాలలో కాలువల్లో సక్రమంగా పూడికలు తీయకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదురైనాయని, నదిలో కలిసే మార్గాలన్నీ మూసుకుపోయాయని, గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఒక మంత్రికి రెండు డివిజన్లు చొప్పున బాధ్యతలు అప్పగించారని, సమన్వయంతో అందరూ కలిసి పని చేస్తున్నామని, విజయవాడ నుండి సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

వరదల వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు మా ప్రభుత్వం పైన బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకోవడానికి, వారికి పునరావాసం కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైసీపీ నాయకుల ఆరోపణలు పట్టించుకోకుండా మా పని మేము చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.












Click it and Unblock the Notifications