పుంగనూరు పులి ఎవరు? పట్టుకోసం పెద్దిరెడ్డి, పవర్ కోసం రామ రామ రామ, ఓటర్లు దేవుళ్లు!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒక్కటి అయిన పుంగనూరుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒక్కటి అయిన బోయకొండ దేవాలయం కూడా పుంగనూరు నియోజక వర్గంలోనే ఉంది. ఎన్నికల ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా పుంగనూరు తీవ్ర చర్చకు దారితీస్తుంది. పుంగనూరులో రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యం.
తరువాత బలిజ, ముస్లీం, యాదవ, ఎస్సీ ఓటర్లు పుంగూరు నియోజక వర్గంలో ఎక్కువగా ఉన్నారు. పుంగనూరులో తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీలకు కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు ఒకసారి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించిన నాటి నుంచి 1996 వరకు పుంగనూరులో ఓడిపోలేదు. టీడీపీ జైత్రయాత్రకు 1999లో పుంగనూరులో బ్రేక్ పడింది.

తరువాత 2004లో టీడీపీ విజయం సాధించినా ఆ తర్వాత అప్పటి పీలేరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరులో ఎంట్రీ ఇచ్చిన తరువాత సైకిల్‌కు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు పీలేరులో మూడు సార్లు ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తరువాత పుంగనూరులో మరో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 వరకు కాంగ్రెస్ నేతగా వున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైసీపీలో చేరారు.
ఉప ఎన్నికలతో పాటు 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పెద్దిరెడ్డి పుంగనూరులో హ్యాట్రిక్ కొట్టారు. 1952లో పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గం ఏర్పడింది. పుంగనూరులో చౌడేపల్లి, సదుం, సోమల, పుంగనూరు, పులిచర్ల, రొంపిచర్ల మండలాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రొంపిచర్ల, సదుం, పులిచర్ల, సోమల మండలాలు పుంగనూరు నియోజకవర్గంలో కలిశాయి. రెడ్డి, ముస్లిం, బలిజ, దళిత వర్గాల ప్రభావం పుంగనూరు నియోజక వర్గంలో ఎక్కువగా ఉంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,07,431 ఓట్లు. టీడీపీ అభ్యర్ధి అనేషా రెడ్డికి 63,876 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా పెద్దిరెడ్డి భారీ మెజారిటీతో పుంగనూరులో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో పుంగనూరులో విజయం సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. పుంగనూరులో పట్టు కోల్పోకూడదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గట్టి పట్టుదలతో వున్నారు.
2024లో మరోసారి వైసీపీ టిక్కెట్ మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బరిలో దిగుతున్నారు. పుంగనూరులో టీడీపీ గెలిచి 20 ఏళ్లు కావొస్తోంది. 2004లో చివరిసారిగా ఎన్. అమర్‌నాథ్ రెడ్డి విజయం సాధించారు. తరువాత ఎన్. అమరనాథ రెడ్డి పలమనేరు నియోజక వర్గానికి వెళ్లారు. పుంగనూరు టీడీపీ బాధ్యతలు ఎన్ అమరనాథ రెడ్డి కుటుంబ సభ్యుల చేతిలో ఉన్నా తరువాత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎంట్రీతో సీన్ మారిపోయింది. అప్పటి నుంచి పుంగనూరు తెలుగుదేశానికి కొరకరాని కొయ్యగా మారింది.

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజకీయ అనుభవం, ఆయన వ్యూహాలను బట్టి చూస్తే ఆయనను పుంగనూరులో ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయితే ఈసారి జగన్ పాలనపై వ్యతిరేకత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పెత్తనంతో జనం విసిగిపోయారని టాక్ ఉంది ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణంగా తెలుగుదేశం గెలుస్తుందని ఆ పార్టీ కేడర్ ధీమాగా వుంది. పుంగనూరులో టీడీపీ అభ్యర్ధిగా చల్లా రామచంద్రారెడ్డి (బాబు)కి టికెట్ కేటాయించారు.
చల్లా రామచంద్రా రెడ్డి కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు. ఒకప్పటి నుంచి పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో చల్లా కుటుంబానికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. అలాగే కొత్తగా పార్టీ స్థాపించిన బోడే రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరులో పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి మీద మొదటి నుంచి తిరుగుబాటు చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ కు జడ్ ప్లస్ భధ్రత ఉందంటే ఆయనకు ఎంత పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు.
బోడే రామచంద్రా యాదవ్ మీద పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేశారని ఆరోపణలు ఉన్నాయి, ఆ సమయంలో తన పలుకుబడి ఉపయోగించిన బోడే రామచంద్ర యాదవ్ నేరుగా అమిత్ షాను కలిసి రెండు మూడు రోజుల్లోనే జడ్ ప్లస్ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. యాదవ, ఇతర బీసీ వర్గాలు తనకు అండగా వున్నాయని బోడే రామచంద్ర యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చల్లా రామచంద్రా రెడ్డి, బోడే రామచంద్ర యాదవ్ లు బరిలో దిగారు. ముగ్గురు రామచంద్రుల్లో పుంగనూరు ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో వేచి చూడాలని ప్రజలు అంటున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications