రావెలతో సయోధ్య: వదలను కానీ.. జానీమూన్, మీడియా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
గుంటూరు: మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ మధ్య ఆదివారం వివాదం ముగిసింది. ఇరువురు నేతలు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ మధ్య బేధాభిప్రాయాలు తొలగిపోయినట్లు చెప్పారు.
మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్ రెడ్డి, గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు సమక్షంలో వివాదం ముగిసింది. ఇరువురి మధ్య నెలకొన్న బేదాభిప్రాయాలు, సమస్యలపై ఒక నిర్ణయానికి వచ్చారు.

చిన్న సమస్యే, సయోధ్య కుదిరింది: పత్తిపాటి
వివాదం ముగిసిన అనంతరం మంత్రులు, జానీమూన్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని, జిల్లా అభివృద్ధికి వారు కలిసి పని చేస్తామని చెప్పారన్నారు.
జిల్లా చైర్ పర్సన్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని మంత్రి రావెల ఇస్తారని, వారి మనసుల్లోని భేదాభిప్రాయాలను తొలగించుకున్నారన్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం సమసిందని, సద్దుమణిగిన వివాదాన్ని సాగదీయటం సరికాదన్నారు.
రాజకీయంగా లబ్ధి పొందేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగంగానే వారి మధ్య వివాదం రేపారని ఆరోపించారు. మొన్న చినరాజప్ప - లోకేష్ ఫోటోతో రెండు వర్గాల మధ్య, ఇప్పుడు రావెల - జానీమూన్ మధ్య చిన్న సమస్యను పెద్దవిగా చేయాలని చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. వైసిపి తీరు గోతికాడి నక్కలా ఉందని ఎద్దేవా చేశారు.
సద్దుమణిగిన వివాదాన్ని సాగదీయటం సరికాదని మీడియా ప్రతినిధులను కోరారు. నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేస్తామని జానీమూన్, రావెల ప్రకటించారన్నారు.
కుటుంబంలో బేదాభిప్రాయాలు రావొచ్చు
కుటుంబంలో బేదాభిప్రాయాలు రావొచ్చని పత్తిపాటి పుల్లారావు అన్నారు. కానీ పరిష్కారం చేయలేనటువంటి బేదాభిప్రాయాలు కాదన్నారు. చిన్నపాటి సమస్య అని, కూర్చోబెట్టి తీర్చుకునేటివన్నారు.
మంత్రి రావెల మాట్లాడుతూ.. జానీమూన్ తనకు కూతురుతో, గఫార్ తనకు అల్లుడితో సమానమన్నారు. ఆమె రాజకీయాలకు కొత్త అని, తనకు కూడా ఇలాంటివి కొత్త అని, కాబట్టి కొన్ని బేదాభిప్రాయాలు వచ్చాయని, ఇప్పుడు సమసిపోయాయని చెప్పారు. తమ మధ్య ఎలాంటి వివాదం ఉండదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. జానీమూన్‌కు ఏ అవసమున్నా సహకరిస్తానన్నారు.
జానీమూన్ మాట్లాడుతూ.. తమ సమస్యలు మంత్రులకు వివరించామని, పత్తిపాటి, పల్లె హామీతో వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు. వివాదం సమయంలో తనకు మద్దతిచ్చిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మళ్లీ ఇలాంటి సమస్యలు పునరావృతం కావని చెప్పారన్నారు. తమకు మంత్రులపై నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు తమకు దేవుడు అని, ఆయన సమస్య పరిష్కరించుకోవాలని సూచించారని, కాబట్టి కలిసి పని చేస్తామన్నారు.
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన విలేకరులు
జానీమూన్, మంత్రి రావెల మధ్య విభేదాలు, ఆ తర్వాత సమసిపోవడంపై మంత్రి పత్తిపాటిపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ఇంటికి కత్తులతో వచ్చి బెదిరించారని, ఇప్పుడు దాని మాటేమిటని విలేకరులు ప్రశ్నించారు. దానికి పత్తిపాటి మాట్లాడుతూ.. ఎవరు చేశారో వారికి కిషోర్ బాబు హెచ్చరికలు జారీ చేస్తారన్నారు.
మరోసారి జరగకుండా చూస్తామన్నారు. ఎవరు వచ్చారో కిషోర్ బాబు చూస్తారన్నారు. ఏ విధంగా జరిగిందో జానీమూన్, రావెల ముఖాముఖి మాట్లాడుకున్నారని, సమస్య పరిష్కరించుకున్నారన్నారు. జానీమూన్ ఒకటి అనుకున్నారని (కత్తులతో వచ్చి బెదిరించారనే అంశంపై) రావెల తనకు తెలియదని చెప్పారన్నారు. వాటి పైన రావెల చర్యలు తీసుకుంటారన్నారు.
వారిని వదలను కానీ, కేసు పెట్టను: జానీమూన్
కత్తులతో వచ్చి తమను బెదిరించారని తాను చెప్పింది అబద్దం కాదని, కానీ దానికి రావెల కిషోర్ బాబుతో సంబంధం లేదని తెలిసిందన్నారు. దీని పైన తాను కేసు పెట్టనని, కానీ పార్టీ పరంగా మాత్రం ముందుకెళ్తానని చెప్పారు. వారు మా పార్టీ వారేనని, వారిని వదిలి పెట్టనని (పార్టీ పరంగా) చెప్పారు.
ఇదీ జరిగింది
రావెల నుంచి తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని జానీమూన్ ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంత్రి అనుచరులు తమపై దాడికి యత్నించారని, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని మీడియా ఎదుట కంటతడి పెట్టారు. ఇది చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు ప్రత్తిపాటి, జీవీ ఆంజనేయులు రంగంలోకి దిగి వివాదానికి ముగింపు పలికారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications