మంత్రి రోజాకు ఎదురుగాలి.. ఈసారి గెలుపు కష్టమేనా..?
మంత్రి రోజాకు నగరి నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. రోజాకు విపక్షాల నుంచి కన్నా.. స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గత రెండు ఎన్నికల్లో తక్కువ ఓట్లతో బయటపడ్డ రోజాకు ఈసారి గెలుపు అంత ఈజీ కాదని మాటలు వినిపిస్తున్నాయి. రోజాకు సొంత పార్టీ నాయకుల ప్రతికూలత కనిపిస్తోంది. రోజా గెలుపుకు పార్టీ నాయకులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.
మాటల తూటాలు పేల్చి ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టడంలో రోజా స్పెషలిస్ట్. నిత్యం వార్తల్లో రోజా పేరు లేకుండా ఉండదు. పవిత్ర పుణ్యక్షేత్రం అయినా అసెంబ్లీ హాల్‌లో అయినా ఆమె మాట్లాడే మాట తూటాలుగా పేలడం ఖాయం. రాష్ట్రమంతా ఓ లెక్క అయితే రోజాకు సొంత నియోజకవర్గంలో మరో లెక్కగా మారింది. ప్రత్యర్థులపై విరుచుపడే రోజా...సొంత నియోజకవర్గ నాయకులను కలుపు పోవడంలో మాత్రం తడబాటు పడుతున్నారు రోజాకు వ్యతిరేకంగా నగరి నియోజకవర్గంలో ఓ కూటమి తయ్యారైంది.

ఎట్టి పరిస్థితిలో రోజాకు టికెట్ ఇవ్వకూడదని ముక్త కంఠంతో కొందరు నాయకులు నినాదించారు . అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న సరే రోజాకు వ్యతిరేకంగా చేయడానికి స్థానిక నేతలు సిద్ధమవుతున్నారు.మంత్రి రోజా, జడ్పీటీసీల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. జగన్ ముద్దు రోజా వద్దు అంటూ నేరుగానే సీఎం జగన్‌కు తమ నిరసనలను తెలియజేశారు. ఇవేమి పట్టించుకోని పార్టీ అధిష్టానం నగరి టికెట్‌ను రోజాకే కేటాయించింది. దీంతో ఓ వర్గం వైసీపీ నేతలు పార్టీ అధిష్టానంపై గరం గరంగా ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో రోజాకు సహకరించేది లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. దీంతో అప్రమత్తం అయిన వైసీపీ అధిష్టానం పార్టీ నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. స్థానిక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన వైసీపీ నేతలు రోజా గెలుపుకు సహకరించాలని కోరారు. అటు రోజాతో సైతం సమావేశం అయిన జిల్లా నేతలు స్థానిక నేతలను కలుపుకుని సమన్వయంతో పని చేసుకోవాలని హితవు పలికినట్టు సమాచారం. అయిన కూడా నగరిలో అధికార పార్టీ నాయకుల మధ్య సఖ్యత ఉన్నట్టు కనిపించడం లేదు. ఈక్రమంలో ఈ ఎన్నికల్లో మంత్రి రోజా గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. మరి స్థానిక నేతలను మంత్రి రోజా ఏవిధంగా కలుపుకుని ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications