అప్పట్లో గ్రౌండ్లో.. ఇప్పుడు రాజకీయాల్లో కబడ్డీ.. తొడగొట్టి చెప్పిన మంత్రి రోజా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎప్పుడూ ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంటారు. సెలబ్రిటీ అయిన రోజా మంత్రిగానూ హంగామా చేస్తున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ఏం చేసినా సంచలనమే. ఇప్పటివరకు ఆమె అంబులెన్స్ నడిపినా, ట్రాక్టర్ తోలినా.. బస్సులు నడిపినా, దిశా వాహనాలపై, బైక్ లపై రైడ్ చేసిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గానే మారింది.
Recommended Video

ఇక ఏ ఆట అయినా ఇష్టంగా ఆడే రోజా గతంలో భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడగా, ఇప్పుడు మళ్ళీ కబడ్డీ ఆటలో కూత పెట్టారు. పర్యాటక శాఖ మంత్రి రోజా తొడగొట్టి సవాల్ విసురుతూ కబడ్డీ ఆడారు. కాకినాడలోని ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ(పురుషులు) టోర్నమెంట్-2023లో పాల్గొన్న మంత్రి రోజా ఆటగాళ్ళతో పాటు కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

కబడ్డీ మాత్రమే కాదు ఏ ఆటైనా ఆడే రోజా క్రీడల పట్ల తన మక్కువను ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇక తాజాగా ఆమె తొడ కొట్టి మరీ కబడ్డీ ఆడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్కే రోజా అటు నటనలోనూ, ఇటు రాజకీయాలలోనే కాదు. ఆట పాటల్లోనూ ఆమె మల్టీ టాలెంటెడ్. ఈ సందర్భంగా రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కబడ్డీ మన సంస్కృతికి ప్రతిబింబం అంటూ వ్యాఖ్యానించిన రోజా క్రీడలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం అంటూ పేర్కొన్నారు. అప్పట్లో గ్రౌండ్లో కబడ్డీ ఆడితే, ప్రస్తుతం పాలిటిక్స్ లో కబడ్డీ ఆడుతున్నానని పేర్కొంటూ మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ పంచ్ డైలాగ్ వేశారు.
ఇక ఈ సమయంలోనే వచ్చే డిసెంబర్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంతో రాబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి సచివాలయ పరిధిలో ఆడదాం ఆంధ్ర క్రీడలు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి రోజా తెలిపారు.యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమని, క్రీడల్లో ఉన్నత స్థాయికి వారిని తీసుకువెళ్తామన్నారు. ఆమె కబడ్డీ ఆడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications