చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా షాకింగ్ వ్యాఖ్యలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబుపై ఏపీ మంత్రులు విరుచుకుపడటం, టీడీపీ నేతలు వారికి రివర్స్ కౌంటర్ లు వేయటం పరిపాటి.
తాజాగా ఏపీ మంత్రి రోజాపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో వైసిపి మంత్రులపై విరుచుకుపడిన చంద్రబాబు న్యూ ఇయర్ వేడుకల్లో క్లబ్బుల్లో డాన్సులు చేసే ఆమె మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతుందని రోజాను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

అలాగే డయాఫ్రం వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అని, పెట్టుబడులు అంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటి మంత్రి అని, కోర్టు ఫైళ్ళు లేపేసేవాడు వ్యవసాయ మంత్రి అని, ధాన్యానికి సంచులు ఇవ్వలేని వాడు పౌరసరఫరాల శాఖ మంత్రి అని చంద్రబాబు ఎద్దేవా చేశాడు.ఏపీలో పరిస్థితులను,జగన్ పాలనా వైఫల్యాలను ఆయన తూర్పారబడుతున్నారు.
ఇక ఈ క్రమంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఈసీ రాజీవ్ కుమార్ ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో మంత్రి రోజా అసలు వారు ఏపీలో ఎన్నికల కమీషన్ ను కలిసే రైటే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ పొలిటిషన్స్ అని రోజా మండిపడ్డారు.
ఈ ఇద్దరు నేతలకు ఏపీలో సొంతిల్లు లేదని, ఓటు హక్కు లేదని విమర్శించారు. చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలు ఏపీలో లేవని, వారు అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు లేదని మంత్రి రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications