'ఆయన' అపర భగీరధుడు!!
రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు ఈరోజు విడుదల చేశారు. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కుడి ప్రధానకాలువ వద్ద పాలకొండ, కురుపాం శాసన సభ్యులు తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణలతో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు.
తోటపల్లి బ్యారేజ్ కుడి కాలువ ద్వారా ద్వారా లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు
కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు క్రింద మొత్తం ఒక లక్ష 31 వేల 221 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. కుడి ప్రధాన కాలువ క్రింద పార్వతీపురం మన్యం జిల్లాలో 13,684 ఎకరాలకు సాగునీరు అందుతుండగా విజయనగరం జిల్లాలో 25,060 ఎకరాలకు నీరందుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 38,975 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మొత్తం 333 గ్రామాలకు చెందిన 1,31,221 ఎకరాలకు ప్రధాన కుడి కాలువ ద్వారా సాగునీరు అందుతుంది.

చంద్రబాబు సర్కార్ రైతు సర్కార్ అన్న మంత్రి సంధ్యా రాణి
ఈ సందర్భంగా మంత్రి సంధ్యా రాణి మాట్లాడుతూ... పూడికలు, తుప్పలు తొలగించి శివారు భూములకు సైతం నీరు అందించాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరధుడని తోటపల్లి ప్రాజెక్ట్ ను ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేశారని తెలిపారు. తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులు, పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు. ఇది రైతు ప్రభుత్వమని అన్నారు.
మంచి పాలనాదక్షుడు చంద్రబాబు
రైతులు రెండు పంటలు పండించుకోవచ్చని ,వలసలు వెళ్ళే అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి పాలనాదక్షుడని, రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 70 శాతం పనులు పూర్తి అయ్యాయని, గత ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి ప్రగతి లేదని చెప్పారు. సాగునీటికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని మంత్రి సంధ్యా రాణి చెప్పారు.
ఐటీడీఏ ల పనితీరుపై మంత్రి వ్యాఖ్యలు
ఐటీడీఏ లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ప్రజలు తమ సమస్యలను తనకు, శాసన సభ్యులకు తెలియజేయవచ్చని ఆమె అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని, అవసరమైన నిధులను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. ఏనుగుల తరలింపుకు గతంలోలా ఆపరేషన్ గజ వంటి కార్యక్రమం నిర్వహించటానికి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications