Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ వీరుడు, కాల్ షీట్లు లేకపోతే రాజకీయాలు చేసే సన్నాసి : మంత్రి శంకర్ నారాయణ ఆగ్రహం

పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై, జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు విరుచుకు పడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి సన్నాసి ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాడో ఆయనకే అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా అధికారంలోకి రావాలని అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ కు ఆ ఆలోచన లేదని మంత్రి శంకర్ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలంలోని భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్న మంత్రి శంకర్ నారాయణ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో పవన్ కే తెలీదు

ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో పవన్ కే తెలీదు

ఈరోజు శ్రీశైలం వెళ్లిన మంత్రి శంకర్ నారాయణ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి శంకర్ నారాయణ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ వీరుడని విమర్శించారు. ఒకసారి తెలుగుదేశం పార్టీతో, మరోసారి బీజేపీతో, ఇంకోసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 సినిమాలు లేకపోతేనే రాజకీయాలు చేస్తారు పవన్ కళ్యాణ్

సినిమాలు లేకపోతేనే రాజకీయాలు చేస్తారు పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కు సినిమా కాల్షీట్లు లేకపోతే రాజకీయాలు గుర్తుకు వస్తాయి అని మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. సినిమాలు లేని సమయంలో అప్పుడప్పుడు వచ్చి ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో రోడ్లపై రాజకీయాలు మొదలు పెట్టారు అంటూ మంత్రి శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ల నిర్వహణా నిధులు పక్కదారి పట్టించడంతోనే రోడ్లకు ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు.

 గత టీడీపీ పాలనలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదో ?

గత టీడీపీ పాలనలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదో ?

ప్రశ్నిస్తాం అని పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2019 వరకు ఎందుకు ప్రశ్నించలేదని, ఎక్కడ నిద్రపోయారని మంత్రి శంకర్ నారాయణ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే జనసేన పార్టీకి నిద్ర రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎదుటివారిపై బురద జల్లడం వెన్నతో పెట్టిన విద్య అంటూ మంత్రి శంకర్ నారాయణ విరుచుకుపడ్డారు. ఇక సోము వీర్రాజు అవగాహన లేక కేంద్ర నిధులు పక్కదారి పట్టాయి అని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మే లోపు రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసేలా టెండర్లు పిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.

జేసీ బ్రదర్స్ మదమెక్కి మాట్లాడుతున్నారు.. వారితో చంద్రబాబుకు తిప్పలే

జేసీ బ్రదర్స్ మదమెక్కి మాట్లాడుతున్నారు.. వారితో చంద్రబాబుకు తిప్పలే

పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు చాలా దారుణంగా ఉందని మంత్రి శంకర్ నారాయణ విరుచుకుపడ్డారు. అంతేకాదు జెసి బ్రదర్స్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి శంకర్ నారాయణ. దివాకర్ రెడ్డి బ్రదర్స్ ను ప్రజలు ఎప్పుడో పక్కన పెట్టేశారు అని వారు మదమెక్కి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జెసి బ్రదర్స్ వ్యవహార శైలితో చంద్రబాబు కూడా తలపట్టుకుంటున్నారు అని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని, రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చాలెంజ్ చేశారు. భయమంటే ఎలా ఉంటుందో నేర్పిస్తానని హెచ్చరించారు. జగన్ ను, వైసీపీ మంత్రులను ఘాటుగా విమర్శించారు. గ్రామ సింహాలతో పోలుస్తూ తిట్టిపోశారు. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+