తిరుమల - వివాదంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ : అనుచరులతో కలిసి..!!
తిరుమల కొండ భక్త జనంతో కిక్కిరిసిపోయింది. అనేక మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి ఉషా శ్రీచరణ్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం మంత్రి అప్పల రాజు తన నియోజకవర్గానికి చెందిన 150 మందితో వీఐపీ దర్శనం కోసం అధికారుల పైన ఒత్తిడి తేవటంతో సాధారణ భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. అయితే, తాను సాధారణ భక్తుడి తరహాలోనే శ్రీవారి దర్శనం చేసుకున్నానని మంత్రి ఆ తరువాత చెప్పుకొచ్చారు.
ఇప్పుడు వరుల సెలవులు.. పెళ్లిళ్ల సీజన్ కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వారికి వసతి - దర్శనం కష్టంగా మారుతోంది. ఈ సమమంలోనే మంత్రి ఉషాశ్రీ చరన్ తన అనుచరలతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండో సారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ అసాధరణ స్థాయిలో ఉండటంతో ఈ నెల 20వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని టీటీడీ స్పష్టం చేసింది.

కానీ, 50 మంది అనుచరులతో ఉషా శ్రీ చరణ్ తిరుమల కొండకు చేరుకున్నారు. 10 మందికి సుప్రభాత సేవా టిక్కేట్లు పోందినట్లుగా చెబుతున్నారు. కళ్యాణదుర్గం ప్రజలతో కలసి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా వుందని మంత్రి చెప్పుకొచ్చారు. అటు సామాన్య భక్తులకు దర్శనం కోసం దాదాపు 30 గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 92,328 మంది భక్తులు దర్శించుకోగా.. 52,969 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.36 కోట్లు హుండీ ఆదాయంగా సమకూరింది. తిరుపతి నగరంతో పాటుగా తిరుమల కొండ పైన పూర్తిగా భక్తులతో నిండిపోయింది. ఈ సమయంలో మంత్రి వ్యవహరించిన తీరు పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications