దేవుడి మీద రాజకీయమా.. సర్కస్ కంపెనీ అంటారా? అశోక్ గజపతి రాజుకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్
విజయనగరం జిల్లా రామతీర్థం బోడి కొండపై రామాలయం శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కావాలనే తనను వైసీపీ మంత్రులు అవమానించారని కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనీయకుండా మంత్రి వెల్లంపల్లి ప్రవర్తించారని ఆలయ ధర్మకర్త గా తనకు మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అశోక్ గజపతి రాజుకు కౌంటర్ వేశారు.

అశోక్ గజపతిరాజుపై మండిపడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
ప్రోటోకాల్ ప్రకారమే అశోక్ గజపతిరాజును ఆహ్వానించామని ఆయన పేర్కొన్నారు. శిలాఫలకంపై పేర్లు వేసే పద్ధతి గత ప్రభుత్వంలో చేయలేదని గుర్తు చేశారు. అశోక్ గజపతిరాజు హుందాగా వ్యవహరించాలని, ఆలయ ధర్మకర్తగా, ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా అంటూ ప్రశ్నించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం నీలాచలం బోడికొండపై ధర్మకర్త అశోక్ గజపతిరాజు వీరంగం సృష్టించాడని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అంటూ అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు చేయడంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

దేవుళ్ళ మీద రాజకీయం చేసే వారిని శ్రీరాముడు శిక్షిస్తాడు
ఏమీ జరగక పోయినా ఏదో జరిగినట్టు అశోక్ గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. అశోక్ గజపతి రాజుకు రాజకీయ మనుగడ లేక ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ళ మీద రాజకీయం చేసే వారిని శ్రీరాముడు శిక్షిస్తాడని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన ఆలయాల భూ కబ్జాలు తిరిగిరాబడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీ అని వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రూల్స్ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఆలయాన్ని అభివృద్ధి చేయకపోగా ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు
తమకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రామతీర్థం కొండ పై స్వామివారి విగ్రహాలు ధ్వంసం అయినప్పుడు వాటి స్థానంలో వేరే విగ్రహాలు పెట్టి తూతూమంత్రంగా తాము చేతులు దులుపుకోలేదని, నాలుగు కోట్ల వ్యయంతో నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ ధర్మకర్త గా, మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి నిధులు తీసుకురాలేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. ఆలయాన్ని అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో వీళ్ళ పాత్ర ఉందేమోనన్న అనుమానం కలుగుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించారు.

ఆలయ శంకుస్థాపనలో ఉద్రిక్తత .. అశోక్ గజపతిరాజు ఆందోళన
ఈ రోజు రామతీర్ధం బోడికొండ పై శ్రీరాముని ఆలయ శంకుస్థాపనలో ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. తనకు అవమానం జరిగిందని ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు ఆందోళన చేశారు. ఆలయ శంకుస్థాపన విషయం ధర్మకర్తల మండలితో చర్చించకపోవటం పై అశోక్ గజపతి రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి విగ్రహ ధ్వంసం చేసిస్న నిందితులను ఇప్పటివరకు పట్టుకోలేకపోయారని మండిపడ్డారు. శంకుస్థాపన పూజలను ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్ నిర్వహించటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గుడి నిర్మాణానికి విరాళం ఇస్తే నా మొహం పై విసిరి కొట్టారని భక్తులు విరాళాలు తిరస్కరించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో శిలాఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు అశోక్ గజపతిరాజు. ఈ క్రమంలో అధికారులు అశోక్ గజపతిరాజుకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర అసహనంతో అశోక్ గజపతిరాజు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ ఆందోళన చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications