వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు తీర్పు పరిశీలించాక తదుపరి నిర్ణయం; చంద్రబాబు వల్లే ఇందంతా: మండిపడిన మంత్రి వెల్లంపల్లి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు, సీఆర్డీఏ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్నంగా పరిశీలించిన తరువాత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటిని పరిశీలించి అప్పీలుకు వెళతామని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా తాము భావించడం లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

3రాజధానులు, సీఆర్డీఏపై హైకోర్టు తీర్పుతో జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: టీడీపీ నేతలు3రాజధానులు, సీఆర్డీఏపై హైకోర్టు తీర్పుతో జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: టీడీపీ నేతలు

అమరావతి రైతులను నట్టేట ముంచింది చంద్రబాబు నాయుడే

అమరావతి రైతులను నట్టేట ముంచింది చంద్రబాబు నాయుడే


ఏపీ ప్రభుత్వం మూడు ప్రాంతాలు 13 జిల్లాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకుందని, అయితే కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏది మంచి అని భావిస్తుందో, ప్రభుత్వం అదే విధంగా ముందుకు వెళుతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు అనుకున్నట్టు జరగదని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అమరావతి రైతులను చంద్రబాబు నాయుడే నట్టేట ముంచారని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

రియల్ ఎస్టేట్ మాఫియా తో కుమ్మక్కై చంద్రబాబు దోపిడీ

రియల్ ఎస్టేట్ మాఫియా తో కుమ్మక్కై చంద్రబాబు దోపిడీ

అమరావతిలో నాలుగు బిల్డింగులు కట్టి రాజధానిగా చంద్రబాబు ప్రచారం చేశారని, రియల్ ఎస్టేట్ మాఫియా తో కుమ్మక్కై చంద్రబాబు అమరావతి నగరం పేరుతో దోపిడీకి పాల్పడ్డాడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అమరావతిని భ్రమరావతి చేసింది చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. అమరావతి భూముల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. రాజధాని రైతులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేశారని, కానీ ఈ ప్రభుత్వం రైతులను మోసం చేయడం లేదని ఆయన వెల్లడించారు.

 అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చెయ్యాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చెయ్యాలన్నదే ప్రభుత్వ లక్ష్యం


రైతుల ముసుగులో ప్రతిపక్ష నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మద్దతు తెలుపుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ మాఫియాకు సహకరించేలా గత ప్రభుత్వం సిఆర్డిఎ చట్టాన్ని రూపొందించిందని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సిఆర్డిఏ చట్టానికి కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

చంద్రబాబు ప్రజలను మోసం చేసినా, మా ప్రభుత్వం మోసం చెయ్యలేదు

చంద్రబాబు ప్రజలను మోసం చేసినా, మా ప్రభుత్వం మోసం చెయ్యలేదు


అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి ఒక హైదరాబాద్ నగరానికే పరిమితమైందని, ఇప్పుడు మళ్లీ అటువంటి పరిస్థితి కలుగకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని అమరావతిని అభివృద్ధి చేయకుండా చంద్రబాబు కాలయాపన చేశారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.

Recommended Video

Telangana: TPCC Secretary Kotla Srinivas Demands Job Notifications | Oneindia Telugu
కోర్టు తీర్పు పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకుంటాం

కోర్టు తీర్పు పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకుంటాం

రైతులకు అన్యాయం జరగనివ్వమని మా ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోందని ఆయన పేర్కొన్నారు. రాజధాని విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును సమగ్రంగా పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించటంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. రాజధాని విషయంలో ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు వెల్లడించింది. గురువారం నాడు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పై కీలక తీర్పును వెలువరించిన హైకోర్టు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. మాస్టర్ ప్లాన్ ను ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించాలని రాజధాని పై ఎలాంటి చట్టాలను చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు వెల్లడించింది.

English summary
Minister Vellampalli Srinivas said the next decision would be taken after considering the High Court verdict. Minister Vellampalli was incensed that injustice was done to the farmers of Amaravati by Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X