చంద్రబాబు రాజకీయ శకం ముగిసింది..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. అటు తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య ఒప్పందం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఏపీలో వైసీపీ ఎన్నికల కోసం కార్యాచరణ సిద్దమైంది. సీఎం జగన్ పార్టీ శ్రేణులకు ఇప్పటికే ఈ మేరకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అటు నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సిద్దం అవుతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ నేరుగా వైసీపీని టార్గెట్ చేస్తోంది. దీనికి వైసీపీ మంత్రులు టీడీపీ, జనసేన పైన కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ ఒక వస్తువుగా వాడుకుంటోందని,రాజకీయాలపై పవన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వన్ కల్యాణ్ రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతమని ప్రశ్నించారు. పవన్‌ను టీడీపీ ఒక వస్తువుగా వాడుకుంటోందని వ్యాఖ్యానించారు.

కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ముద్రగడను చంద్రబాబు తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలని సూచించారు.
చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నారని విమర్శించారు. దేశంలో చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు నేడు బెయిల్ రావడం లేదని చెప్పుకొచ్చారు.
చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు ముఖ్యమంత్రి జగనేనని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఇద్దరే కాదు ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. జనం మనసులో జగన్ ఉన్నారన్నారు. సీఎం జగన్ మనసులో జనం ఉన్నారని చెప్పిన మంత్రి వేణు.. జగన్, జనం మధ్య బంధాన్ని ఎవరూ విడదయలేరని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications