విజయవాడలో దారణం: మద్యం తాగించి బాలికపై అత్యాచారం
అమరావతి: 15 ఏళ్ల బాలికకు మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇలియాజ్ అనే వ్యక్తి విజయవాడలోని ఓ హోటల్‌లో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణలో పని ఇప్పిస్తానంటూ ఆ బాలికను ఓ మహిళ ఇలియాజ్ దగ్గరికి తీసుకొచ్చినట్లు నిందితుడు చెప్పాడు. బాలికపై చేసిన అత్యాచార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

గుంటూరులో బాలికపై అత్యాచారం
గుంటూరు నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. నగరంలోని లాలాపేటలోని యానాది కాలనీకి చెందిన ఓ బాలిక (15) బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను మెడికల్ పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మూడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారం
మూడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలంలో గురువారు చోటు చేసుకుంది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications