సీటిచ్చి, యువతిపట్ల అసభ్యంగా.., భార్య నో చెప్పిందని..

Misbehaving with girl in Garib Rath
హైదరాబాద్: రైల్లో ప్రయాణిస్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు రైలు అటెండెంట్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. బీహార్‌కు చెందిన నితీష్, బీరజ్‌లు విశాఖ - సికింద్రాబాద్ గరీబ్ రథ్ రైల్లో బెడ్ రోల్ అటెండెంట్లుగా పని చేస్తున్నారు.

విశాఖకు చెందిన ఓ యువతి మాదాపూర్‌లో ఉంటూ ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. దసరా పండగకు ఇంటికి వెళ్లిన ఆమె సోమవారం గరీబ్ రథ్ రైల్లో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ పైన సికింద్రాబాదుకు బయలుదేరింది. టీటీఈ ఆమెకు ఓ సీటు చూపించారు.

రాజమండ్రిలో ఆ సీటు రిజర్వ్ చేయించుకున్న వ్యక్తి రావడంతో సీటు అతనికి ఇచ్చి పక్కనే నిల్చుంది. ఇది గమనించిన బెడ్ రోల్ అటెండెంట్లు వారి సీటును ఆమెకు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. రైలు సికింద్రాబాదుకు వచ్చాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

భార్య విడాకులు కోరుతోందని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బంజారాహిల్స్‌లరో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం కొన్నూర్‌కు చెందిన శ్యామ్ అదే ప్రాంతానికి చెందిన శిరీషను మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల పుట్టింటికి వెళ్లిన శిరీష తిరిగి రాలేదు. విడాకులు కావాలని అడిగింది. దీంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనంటే ఇష్టం లేదని చెప్పినందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+