Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిక్కుల్లో చంద్రబాబు - సుప్రీంలో లిస్టయిన ఓటుకు నోటు కేసు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu)పై మరో పిటీషన్ సుప్రీం(Supreme Court)లో దాఖలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ఓటు కు నోటు కేసు(Vote for Note Case)లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే (MLA RK)తాజాగా సుప్రీంలో రెండు పిటీషన్లు దాఖలు చేసారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా..ఈ కేసు అక్టోబర్ 4న లిస్టు అయింది. అక్టోబర్ 3న స్కిల్ స్కాం(Skill Scam)లో సుప్రీంలో చంద్రబాబు పిటీషన్ విచారణ జరగనుంది. మరుసటి రోజునే ఈ పిటీషన్ లిస్టు అయింది.

ఓటు కు నోటు కేసు: మరో సారి ఓటు కు నోటు కేసు తెర పైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..ఇదే సమయంలో తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసారు.

MLA Alla Ramakrishna Reddy seeks naming Chandrababu as accused in Cash for Vote case in Supreme Court

2017 లోనూ ఈ పిటీషన్లను దాఖలు చేయగా..ఈ నెల 4న సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసు లిస్టు అయింది. అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు వ్యవహారం లో చంద్రబాబు పాత్ర పైన ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంను ఆశ్రయించారు.

సుప్రీంకు ఎమ్మెల్యే ఆర్కే: ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కిన ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి చంద్రబాబు డబ్బులు ఇచ్చారనేది ఆర్కే అభియోగం. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మద్దతును రేవంత్ రెడ్డి కోరారు.

MLA Alla Ramakrishna Reddy seeks naming Chandrababu as accused in Cash for Vote case in Supreme Court

ఈ సందర్భంగా రూ. 50 లక్షలు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వచ్చారనే అభియోగంపై రేవంత్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అనంతర పరిణామాలతో ఈ కేసు మరుగున పడింది.

సుప్రీంలో లిస్టయిన కేసు: ఓటుకు నోటు కేసులో బాబు పాత్రపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా.. హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ.. ఆర్కే సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సంచలనంగా నిలిచింది.

MLA Alla Ramakrishna Reddy seeks naming Chandrababu as accused in Cash for Vote case in Supreme Court

ప్రస్తుతం స్కిల్ స్కాంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు క్వాష్ పిటీషన్ ఈ నెల 3న సుప్రీంలో విచారణకు రానుంది. ఆ మరుసటి రోజునే ఓటుకు నోటు కేసు లిస్టు అవ్వటంతో వరుసగా రెండు రోజులు సుప్రీంలో కేసుల వ్యవహారం పైన ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+