తాడిపత్రి హింస వెనుక టీడీపీ ఓటమి భయం: ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడుల పరంపర కొనసాగుతుంది. అనేక ప్రాంతాలలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో నివురు గప్పిన నిప్పులా వాతావరణం ఉంది. ఓడిపోతామనే భయంతోనే టిడిపి హింస రాజకీయాలకు పాల్పడుతుందని అనంతపురం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో టిడిపి హింస రాజకీయాలను ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన తాడిపత్రిలో ఘర్షణలకు పోలీసులు బాధ్యత వహించాలన్నారు.
తాడిపత్రిలో పెద్దారెడ్డిపై దాడి అమానుషం: ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి
తాడిపత్రిలో ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగిందని ఎస్పీ తో పాటు ఏఎస్పీ రామకృష్ణ చౌదరి కూడా ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యకాండకు దిగారని, పోలీసులు దౌర్జన్యం అమానుషమని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడిపత్రి ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ని సస్పెండ్ చేయాలని డిమాండ్
చంద్రబాబు డైరెక్షన్లోనే దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమి పట్టించుకోని ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ని సస్పెండ్ చేయాలని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఉరవకొండ వైఎస్ఆర్సిపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఓటమి భయంతోనే టిడిపి హింస రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
టిడిపి హింస రాజకీయాలు చేస్తుంది: ఉరవకొండ వైసీపీ అభ్యర్థి
అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికలలో హింస చెలరేగింది అని, తాడిపత్రిలో టిడిపి అరాచకాలకు పోలీసుల నైతిక బాధ్యత వహించాలన్నారు. తాడిపత్రిలో జరిగిన దాడి ఘటనలకు ఈసీ కూడా బాధ్యత వహించాల్సి ఉందని ఆరోపించారు. రౌడీ షీటర్లు, ఖూనీ కోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారని విమర్శించారు.
పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్య :సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాని పిరికిపంద చర్యగా భావిస్తున్నామని వైయస్సార్సీపి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు పేర్కొన్నారు. టిడిపి కూటమికి ఓటమి భయం పట్టుకుందని వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడి పిరికిపంద చర్యగా తాము భావిస్తున్నామని వైఎస్ఆర్సిపి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు స్పష్టం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications