కారణమిదే: పార్టీ నేతలపై 'గెటౌట్' అంటూ బాలయ్య ఇలా..
Recommended Video

హిందూపురం: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం , గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ అయ్యారు. కలిసి ఉంటే ఉండడం లేదంటే వెళ్ళిపోవాలని బాలయ్య పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గంలో నేతల తీరుతో బాలయ్యకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. దీంతో బాలయ్య పార్టీ నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
హిందూపు రంలోని తన నివాసంలో ఆయన బుధవారం నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో మండలాల వారీగా పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలోనే పార్టీ నేతలు తీవ్రంగా గొడవ పెట్టుకోవడంతో బాలయ్య నేతల తీరుపై సీరియస్ అయ్యారు. కలిసి పనిచేస్తే చేయాలని ఆయన కోరారు. లేకపోతే వెళ్ళిపోవాలని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యే పీఏగా గతంలో పనిచేసిన ఓ వ్యక్తి కారణంగా హిందూపురం నియోజకవర్గంలో టిడిపి నేతలు గ్రూపులుగా ఏర్పడ్డారు. అయితే ఈ విషయమై పార్టీ నాయకత్వం జోక్యం చేసుకొంది పిఏను మార్చడంతో నేతలు సంతృప్తి చెందారు.

ఎలా పనిచేయాలని బాలయ్యను ప్రశ్నించిన నేతలు
చిలమత్తూరు ప్రజాప్రతినిధుల, నాయకులతో రెండు గంటల సేపు సుదీర్ఘంగా చర్చించారు బాలకృష్ణ. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు తమ గోడును చెప్పారు. గత స్థానిక, సార్వత్రిక ఎ న్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా చేసిన వారిని ఎలా క లుపుకొని వెళతామని ప్రశ్నించారు. తాము పార్టీకి విధేయులమని పార్టీ కార్యక్రమాలకు పిలుపు ఇవ్వనం దునే గ్రూపులు ఏర్పడ్డాయని మరో వర్గం సమాధానం చెప్పుకొచ్చారు. గ్రూపుల వల్ల పార్టీ దెబ్బతింటుందని... ఇలాగే ఉంటే ఎలా అంటూ... నువ్వెంత అంటే నువ్వెం త అంటూ ఎమ్మెల్యే ముందు తీవ్ర స్థాయిలో గొడవపెట్టుకొన్నారు.

కలిసి పనిచేయాల్సిందేనన్న బాలయ్య
నియోజకవర్గం ప్రజలను అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల చెంతకు చేర్చాలన్నది నా తపన. అందుకు మీరు కలిసి వస్తే ఉండండి ... లేదంటే వెళ్లిపోండి.' అంటూ టీడీపీ చిలమత్తూరు మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ నేతలంతా గ్రూపులుగా విడిపోయి తన ముందే గొడవకు దిగడంతో బాలయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.పార్టీ మండల కన్వీనర్ బాబుల్‌రెడ్డి వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మందలించారు

హిందూపురం నేతలు జోక్యం చేసుకోరన్న బాలయ్య
హిందూపురం నుంచి నాయకుల జోక్యం వల్ల గ్రూపులు ఏర్పడాయని చిలమత్తూరు నేతలు బాలకృష్ణ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో బాలకృష్ణ కూడ సీరియస్‌గా స్పందించారు. ఏ నాయకుడు కూడా మా మండలంలో జోక్యం చేసుకోకుండా చూడాలని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే మీ విషయంలో ఎవరు జోక్యం చేసుకోరని, మీరు కూడా హిందూపురంలో ఎవరితో కలువకూడదన్నారు. ఏదైనా ఉంటే తన దగ్గరికి వచ్చి చెప్పండని సూచించారు.

మున్సిఫల్ కమిషనర్‌పై బాలయ్యకు ఫిర్యాదు
మునిసిపల్ కమిషన ర్ విశ్వనాథ్‌పై మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మితో పాటు కౌన్సిలర్లు, టీడీపీ నాయకుడు నాగరాజు ఎమ్మెల్యే ఫిర్యాదుచేశారు. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుతో అభివృద్ది కుంటుపడిందని వారు ఆరోపించారు. పట్టణంలో నీటి సమస్య పరిస్కారానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకురావడం, కూరగాయల మార్కెట్‌ను త్వరితగతిన పూర్తి చేయడం, రైల్వేలైను వెడల్పు, ఇతర అభివృద్ది పనులు లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధుల కింద రానున్న రూ.66 కోట్లతో పట్టణంలో ప్రతివార్డులో సిమెంటు రోడ్లు, కాలువలు చేపట్టేందుకు సహకారం అందించాలని కోరారు












Click it and Unblock the Notifications