టీడీపీ, బీజేపీ పొత్తు పై గంటా క్లారిటీ - మూడు పార్టీలు ఒక్కటవుతాయి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పొత్తుల లెక్కల పైన స్పష్టత వస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు ఇప్పటికే ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి రావాలని పవన్ కోరుతున్నారు. బీజేపీ నుంచి మాత్రం స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ నేత నారా లోకేశ్ కలిసారు. చంద్రబాబు కేసులు...అరెస్ట్ వ్యవహారం పైన ఫిర్యాదు చేసారు. ఈ సమయంలోనే టీడీపీ, బీజేపీ పొత్తు ప్రచారం మొదలైంది. దీని పైన టీడీపీ సీనియర్ నేత గంటా క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో ఎన్నికలు, పొత్తులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, సీపీఐ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతాయని చెప్పారు. బీజేపీ ఎంత వరకు కలిసి వస్తుందనేది కాలం నిర్ణయిస్తుందని తెలిపారు. వైసీపీకి ఇంటికి పంపించాలనే లక్ష్యంతో పని చేసే పార్టీలన్నీ కలుస్తాయన్నారు. జాతీయ పార్టీ అధి నాయకత్వం ఏమి చెబితే పురంధేశ్వరి అదే చేస్తారని.. వైసీపీవి అర్థం లేని ఆరోపణలు అని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. విశాఖకు సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ దొంగ జీఓ విడుదల చేసిందని.. జీఓ ఇచ్చిన అధికారులు సిగ్గు పడాలన్నారు.

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తురావడం హాస్యాస్పదంగా ఉందని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తే లేకుంటే తాము టీడీపీతో కలిసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసాయి. టీడీపీతో పొత్తు ప్రకటన తరువాత పవన్ కల్యాణ్ తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ నేతలు మాత్రం కొందరు అంతర్గత చర్చల్లో బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. పవన్ పూర్తిగా బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు డైలమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. అటు వైసీపీ ఇప్పటికే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది. అయితే, ఏపీలో ప్రతిపక్షాల పొత్తుల లెక్కలు మాత్రం చంద్రబాబు చేతిలోనే ఉన్నాయని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా గంటా వ్యాఖ్యలతో మూడు పార్టీల పొత్తులకు టీడీపీ సిద్దం అయినట్లు స్పష్టం అవుతోంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications