'టెన్త్ విద్యార్థికీ గర్ల్‌ఫ్రెండ్, అమ్మో.. చంద్రబాబు రాకుంటే'
హైదరాబాద్: పదో తరగతి చదివే వాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ అలవాటైపోతోందని, సమాజంలో విలువలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాలని విశాఖ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బుధవారం నాడు శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో అన్నారు.
ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధి కేటాయించాలని, అలాగే మద్యం విధానాన్ని కేరళలో ఉన్నట్టు ప్రకటించాలని చెప్పారు. ఉదయం 5 నుండి 10 గంటల వరకే బార్‌లను పరిమితం చేయాలని సూచించారు. విశాఖకు ఐఐటి కేటాయించాలని, ఇప్పటికే చెన్నైలో ఐఐటి ఉన్నందున, తిరుపతిలో ఐఐటి పెట్టడంలో అర్ధం లేదని, వైజాగ్‌లో ఐఐటి పెట్టాలని అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్య నాయుడు పాత్ర అద్భుతమన్నారు. విద్యారంగంలో నైతిక విలువలను పాదుగొల్పాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో ప్రజలు అంతా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.
అదే జరగకపోతే అని ఆలోచిస్తుంటే భయంకరంగా అనిపిస్తోందన్నారు. శాసనసభలో సత్యమేవ జయతే నినాదం కింద తన కోపమే తనకు శత్రువు అనే నినాదాన్ని చేర్చాలని సూచించారు. చంద్రబాబుకు దేశాధినేతలు స్నేహితులుగా ఉన్నారని దాని వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications