కడప కార్పొరేషన్ సమావేశం లో రచ్చ రచ్చ..!!
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి గందరగోళానికి దారి తీసింది. రచ్చరచ్చగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ వేదికగా కుర్చీలాట మరోసారి రచ్చ రాజేసింది. ముయర్ - ఎమ్మెల్యే మధ్య కుర్చీ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. కొంత కాలంగా కార్పోరేషన్ సమావేశాల వేళ ఈ ఇద్దరి మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కాగా, ఈ రోజు మరో సారి జరిగిన వివాదంతో కడప కార్పోరేషన్ లో రచ్చ వార్తల్లో నిలిచింది.
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. సర్వసభ్య సమావేశం కోసం అధికారులు సమావేశ మందిరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మేయర్, కమిషనర్ తోపాటు కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. కగా, మేయర్ సురేశ్ బాబు సమావేశ మందిరంలో కాకుండా తన ఛాంబర్‌లోనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ సభ్యు లు కూడా సమావేశ మందిరానికి రాకుండా మేయర్ ఛాంబర్‌లోనే సమావేశమయ్యారు. దీంతో, తనకు తెలియకుండా సమావేశ మందిరంలో ఏర్పాట్లు ఎందుకు చేశారంటూ అధికారులు, సిబ్బందిపై మేయర్ సురేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం తన ఛాంబర్‌లోనే నిర్వహించాలని కమిషనర్‌కు ముందుగానే లేఖ రాసినట్లు మేయర్ తెలిపారు.

సమావేశం కోసం అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు 8 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరం లో నే చాలాసేపు వేచి చూశారు. వైసీపీ కార్పోరేటర్లు రాలేదు. దీంతో, నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ మందిరంలో కాకుండా మేయర్ ఛాంబర్‌లో సమావేశం ఏంటని నిలదీసారు. కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్‌రెడ్డి కూడా సమావేశ మందిరానికి వచ్చి వేచి చూశారు. సమావేశ మందిరంలోనే సమావేశ మయ్యారు. గతంలోనూ మేయర్ - ఎమ్మెల్యే మధ్య కుర్చీ వివాదం కొనసాగింది. కాగా, మేయర్ సురేశ్ బాబు ఛాంబర్‌కు అధికారులు నోటీసులు అంటించారు. ఈ నెల 13న ఇచ్చిన నోటీసు ప్రకారం కౌన్సిల్ హాల్‌లోనే సమావేశానికి ఏర్పాటు చేశామని అందులో పేర్కొన్నారు. కోరం సభ్యులు లేనందున ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు పరిగణించాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications