చంద్రబాబును పార్టీ మూసెయ్యమన్న రోజా .. కనీసం కుప్పంలో కూడా ఏం చెయ్యలేదన్న మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లాలో వివిధ బీసీ కార్పొరేషన్ లకు చైర్మన్లు , డైరెక్టర్లుగా నియమితులైన వారిని సన్మానించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా లు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చారని పేర్కొన్నారు. అంతేకాదు చిత్తూరు జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారని తెలిపారు.

బీసీల కోసం చంద్రబాబు చేసిందేంటి ? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్న
మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేసిన వైయస్ జగన్ బీసీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో, జిల్లాలో కాదు, కనీసం కుప్పంలో కూడా ఏమీ చేయలేకపోయారని, బీసీల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. గ్రామ వార్డు సచివాలయంలో 63 శాతం బీసీలకు స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్ దే అని స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలు తప్ప, చేతల్లో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు

చంద్రబాబు బీసీల కోసం చెయ్యలేని పని జగన్ చేశాడన్న రోజా
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా మరి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసించారు. బీసీల అభ్యున్నతి కోసం ఏకంగా 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా పాలకవర్గాలను నియమించడం ఒక చరిత్ర అంటూ పేర్కొన్న రోజా బీసీల పార్టీగా చెప్పుకున్న చంద్రబాబు బీసీల కోసం చేయలేని పనిని జగన్ చేసి చూపించారు అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. బీసీలకు వైసిపి ప్రభుత్వ హయాంలో పెద్దపీట వేశారంటూ కితాబిచ్చారు రోజా.

బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ క్లాసెస్
బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ క్లాసెస్ అని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారంటూ రోజా పేర్కొన్నారు. 15 నెలల కాలంలో నే 35 వేల కోట్ల రూపాయలు బీసీలకు అందించారు అంటే ఆ ఘనత ఒక్క జగన్ కు మాత్రమే ఉందని నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు బిసి వ్యతిరేకిగా జగన్ పై ముద్ర వేయాలని చూసినా ప్రజలకు అంతా అర్థమవుతుందని రోజా స్పష్టం చేశారు.

చంద్రబాబు పార్టీని మూసెయ్యాలని రోజా సలహా
ఇక చంద్రబాబు తెలుగుదేశం పార్టీని మూసేయాలని రోజా సలహా ఇచ్చారు. చంద్రబాబు దుకాణం బంద్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ రోజా పేర్కొన్నారు. అసలు బీసీలకు చంద్రబాబు ఏం చేశారో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అంటూ రోజా ప్రశ్నించారు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత ఆర్థిక సహాయాన్ని బీసీలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేశారని రోజా కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications