రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తుందని నాడు .. మాకు గౌరవం లేదా చంద్రబాబు; ఎమ్మెల్యే రోజా చురకలు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియా సాక్షిగా తన భార్య పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ ఇంతటి అవమానాన్ని ఎదుర్కోలేదని బాధపడిన చంద్రబాబుపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చంద్రబాబు హైడ్రామా పై మాట్లాడిన రోజా అవతలి వ్యక్తులు వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు చంద్రబాబుకు బాధ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏడుపును ఎంజాయ్ చేసినట్టు మాటల తూటాలను సంధిస్తూ వీడియో రిలీజ్ చేసిన రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కౌంటర్ ఇచ్చారు.

విధి ఎవ్వరినీ విడిచిపెట్టదు ... అందరి సరదా తీర్చేస్తుందన్న రోజా
చంద్రబాబు విధి ఎవరిని విడిచిపెట్టదు.. అందరి సరదా తీరుస్తుంది అని రోజా పేర్కొన్నారు . 72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ను నువ్వు ఎంత ఏడిపించావో గుర్తుందా? ఇప్పుడు 71 సంవత్సరాల ఏడు నెలలకే నువ్వు ఏడ్చే రోజు వచ్చింది అంటూ రోజా చంద్రబాబు ను టార్గెట్ చేశారు. అందుకే అంటారు మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుంది అంటూ రోజా ధ్వజమెత్తారు. మీ కుటుంబ సభ్యులను అన్నారని ఈరోజు తెగ బాధపడుతున్నారు నువ్వు అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ అసెంబ్లీలో రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తుందని పీతల సుజాత తో సిడిలు చూపించావు మరిచిపోయావా అంటూ ఎమ్మెల్యే రోజా ద్వజమెత్తారు .

నన్ను అవమానించిన రోజు నాకు ఫ్యామిలీ లేదా ?
ఆరోజు నాకు ఫ్యామిలీ లేదా? నాకు పిల్లలు లేరా? నాకు గౌరవం లేదా? అని రోజా ప్రశ్నించారు. ఎవరిని ఏదైనా అంటాం అన్న తీరుగా మీ వ్యవహారం లేదా? అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చా? అంటూ రోజా ప్రశ్నించారు. భారతిని ఏమన్నావో.. షర్మిలని ఏమన్నావో గుర్తులేదా అంటూ ప్రశ్నించిన రోజా మా నాయకుడిని, ఆయన కుటుంబ సభ్యులను ఎంత ఏడిపించావో ఎవరూ మరిచిపోలేదు అంటూ రోజా చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఈరోజు నీ కుటుంబ సభ్యులను ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడరని తెలుసుకో అంటూ రోజా చంద్రబాబుపై మండిపడ్డారు.

నా క్యారెక్టర్ని అవమానించావు .. గుర్తు లేదా ?
అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోడీతో సహా ఎవర్ని వదిలి పెట్టకుండా ఎన్ని మాట్లాడావు.. సోషల్ మీడియా ద్వారా ఎన్ని అసత్య వార్తలు వ్యాప్తి చేసావో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే ఉన్నారని రోజా పేర్కొన్నారు.
నీ కోసం నీ పార్టీ కోసం పదేళ్ల పాటు పనిచేసిన మహిళలని కూడా కనికరం లేకుండా నా క్యారెక్టర్ని అవమానించారని రోజా చంద్రబాబు పై ధ్వజమెత్తారు. అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి మానసికంగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారన్నారు రోజా.
Recommended Video

బైబై బాబు అంటూ బాబు ఏడుపుపై సంతోషంతో రోజా
మహిళా పార్లమెంటుకు పిలిచి నన్ను 24 గంటలు డిటెయిన్ చేసిన విషయాన్ని ఇంకా మరిచిపోలేదు అన్నారు అది తనని ఎంతో మానసిక క్షోభకు గురి చేసిందని రోజా పేర్కొన్నారు. రూల్స్ కు విరుద్ధంగా సంవత్సరంపాటు సస్పెండ్ చెయ్యగలిగావు చంద్రబాబు అని పేర్కొన్న రోజా దేవుడు నిన్ను రెండున్నర సంవత్సరాలు కాదు ఇక ముందు ముందు జీవితంలోనే అసెంబ్లీలో అడుగు పెట్టని విధంగా నీకు నువ్వే శపధం చేసుకున్నావు అని రోజా చంద్రబాబుని టార్గెట్ చేశారు. బై బై బాబు అంటూ ఎమ్మెల్యే ఆర్కే రోజా బాధలో ఉన్న చంద్రబాబును మరింత బాధించేలా చురకలంటించారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications