వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాకీపరిశ్రమ రమ్మన్నా రానిది అందుకే... టీడీపీపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సంచలనం!!

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై మరోమారు విరుచుకుపడ్డారు. వైసిపి హయాంలో రాష్ట్రానికి రాకుండా జాకీ కంపెనీ పోతుందని తప్పుడు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలపై ఆయన ఎదురు దాడి చేశారు. గత ప్రభుత్వంలో వెళ్లిపోయిన సంస్థతో తమకు ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆ పెట్టుబడులు కాకులు ఎత్తుకెళ్ళాయా? ప్రశ్నించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

ఆ పెట్టుబడులు కాకులు ఎత్తుకెళ్ళాయా? ప్రశ్నించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

జాకీ పరిశ్రమ అనేది ఒక లూటీ పరిశ్రమ అని పేర్కొన్న వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆ పరిశ్రమ ఇతర రాష్ట్రాలలో తమ యూనిట్లను మూసివేసిందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు అప్పటి మంత్రి పరిటాల సునీత పరిశ్రమల పేరుతో మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ చేయడానికి ప్రయత్నించారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అప్పుడు మంత్రి లోకేష్ చెప్పారని, ఇప్పుడు ఆ పెట్టుబడులు కాకులు ఎత్తుకెళ్ళాయా చెప్పాలంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో జాకీ పరిశ్రమ రాకుండా పోయింది ఎందుకు?

టీడీపీ హయాంలో జాకీ పరిశ్రమ రాకుండా పోయింది ఎందుకు?


రాని పరిశ్రమలు వచ్చాయని టీడీపీ నేతలు కట్టుకథలు చెప్పారని మండిపడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జాకీ పరిశ్రమ కోసం 140 కోట్ల విలువైన భూమిని 2.80 కోట్లకు సేల్ డీడ్ చేశారని, మరి ఆరోజు పరిశ్రమ ఎందుకు కట్టలేకపోయారో చెప్పాలంటూ నిలదీశారు. 2018 అక్టోబర్ లోనే జాకీ పరిశ్రమ ఉత్పత్తి, ట్రైనింగ్ ప్రారంభించాలని ఒప్పంద ఉందని పేర్కొన్న ఆయన మరి ఎందుకు ఉత్పత్తి ప్రారంభించలేదో చెప్పాలని ప్రశ్నించారు. కాంపౌండ్ వాల్ సగంలోనే ఎందుకు ఆపేశారో చెప్పాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.

జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలలో నాలుగు యూనిట్లను మూసేసింది

జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలలో నాలుగు యూనిట్లను మూసేసింది


పరిశ్రమల స్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నదని పేర్కొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల విషయంలో తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జాకీ పరిశ్రమ నిర్వాహకులు తిరువూరు, బెంగళూరులో నాలుగు యూనిట్లను మూసివేశారని పేర్కొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇలాగే రాప్తాడు లో కూడా జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని తెలిపారు.

జాకీ పరిశ్రమ రమ్మన్నా రావటం లేదన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

జాకీ పరిశ్రమ రమ్మన్నా రావటం లేదన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి


ఇక ప్రస్తుతం కూడా జాకీ పరిశ్రమను రమ్మన్నా రావడంలేదని పేర్కొన్న ఆయన భువనేశ్వర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా భూములు తీసుకున్నారని గుర్తు చేశారు. నాడు టిడిపి హయాంలో వస్తుంది అని చెప్పిన కంపెనీని తీసుకురాలేకపోయిన చేతకానితనానికి, నేడు వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాము అడిగిన ప్రశ్నలకు గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. వివిధ పత్రికలలో వస్తున్న వార్తా కథనాలపైనా ఆయన విరుచుపడ్డారు.

గన్నవరం విమానాశ్రయ భూముల కౌలుపై అశ్వనీదత్ పిటీషన్ విచారణ.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలుగన్నవరం విమానాశ్రయ భూముల కౌలుపై అశ్వనీదత్ పిటీషన్ విచారణ.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

English summary
Raptadu MLA Topudurthi Prakash Reddy has made sensational allegations that because of TDP the jockey industry has not come to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X