బాబువన్నీ మంగమ్మ శపథాలే .. చంద్రబాబుపై విరుచుకుపడిన వల్లభనేని వంశీ
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టార్గెట్ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వల్లభనేని వంశీ గతంలో జరిగిన కార్యక్రమాలకు ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన 30 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై కోర్టు అనుమతి తరువాత రిజిస్ట్రేషన్ చేయిస్తామని స్పష్టం చేశారు.
చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి దేవినేని .. వెన్నుపోటుకు పేటెంట్ బాబుదే .. కొడాలి నాని తిట్ల దండకం

టిడిపి హయాంలో రెండు లక్షల ఇళ్లు ఇస్తామని మంగమ్మ శపధాలు చేసిన చంద్రబాబు
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వంశీ చంద్రబాబు ఆనాడు టిడిపి హయాంలో రెండు లక్షల ఇళ్లు ఇస్తామని మంగమ్మ శపధాలు చేశాడని , కానీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చే పట్టాలను అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్లారని మండిపడ్డారు వల్లభనేని వంశీ. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు చెడగొట్టడం తప్ప ఏమీ చేయలేక పోయారని విమర్శించారు .

చంద్రబాబు పసుపు కుంకుమ ఇస్తే, మహిళలు ఉప్పు కారం పెట్టారు
సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుపేదల కోసం మంచి రోజు చూసి ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపడితే చాలామందికి కడుపు నొప్పిగా ఉందని వల్లభనేని వంశీ మండిపడ్డారు. గతంలో టీడీపీ ఇచ్చిన పట్టా భూములకు రాళ్లు కూడా కనిపించడం లేదని వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పసుపు కుంకుమ ఇస్తే, చంద్రబాబు నైజం తెలిసిన మహిళలు గత ఎన్నికల్లో ఉప్పూకారం పెట్టారని వల్లభనేని వంశీ సెటైర్లు వేశారు. దేవినేని ఉమ బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వల్లభనేని వంశీ.

దేవినేని ఉమాను టార్గెట్ చేసిన వంశీ
వ్యవసాయ భూముల పల్లంగా కాకపోతే ఇంకా ఎలా ఉంటాయో చెప్పాలన్నారు. దేవినేని ఉమా ఇంటికి కాంట్రాక్టర్లు తిరుగుతున్నారని, ఆయన తక్కువ ధరకు భూమిని ఇప్పించగలరా అంటూ ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకునే నాయకులను ప్రజలు నిలదీయాలని వల్లభనేని వంశీ కోరారు. ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని పదే పదే చెబుతున్నారు.