సీఎంఓలో ఎమ్మెల్యేలు, మంత్రులు గంటలకొద్దీ బయటనే పడిగాపులు: జక్కంపూడి బాటలో కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైన తర్వాత ఏపీలో జగన్ పాలనలో ఏం జరిగింది అన్నది ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుంది. అన్నీ నేనే, అంతా నేనే అన్నట్టు జగన్ పాలన సాగిందని, ఎమ్మెల్యేలకు కనీసం ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదని, ఎమ్మెల్యేలను పట్టించుకునే నాధుడే లేడని, దాని పర్యవసానమే ఏపీలో వైసీపీ ఘోర ఓటమి అని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

సీఎంఓ అధికారులపై సంచలన ఆరోపణలు చేసిన జక్కంపూడి రాజా
నిన్నటికి నిన్న రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సీఎం ని కలవాలని ఆఫీసుకు వెళితే, సీఎంఓలో ఏం జరిగేదో పూస గుచ్చినట్టు చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉండేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను ఊహల్లో ఉంచారని, ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి సీఎం లా వ్యవహరించే వాడని జక్కంపూడి రాజా మండిపడ్డారు.

MLAs and Ministers to wait outside for hours in CMO Kethireddy venkatarami reddy sensation

సీఎంఓలో ఎవడెవడో కూర్చొని గంటల కొద్దీ ముచ్చట్లు
జగన్ కు ఏ విషయం చెప్పాలి అన్న, ఫైల్ ఇవ్వాలి అన్న ధనుంజయ్ రెడ్డి రూమ్ బయట ఉదయం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు నిలబడి పడిగాపులు కాయాల్సి వచ్చేదని ఆరోపించారు. ఇక తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జక్కంపూడి రాజా బాటలో సంచలన వ్యాఖ్యలు చేశారు. CMO లో ఎవడెవడో కూర్చొని గంటలు గంటలు మాట్లాడుతుంటారని, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కలవడానికి మాత్రం అవకాశం ఇవ్వరని ఆరోపించారు.

ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎంఓలో పడిగాపులు
సీఎంఓకి వెళితే ఎమ్మెల్యేలు, మంత్రులు గంటలు గంటలు అపాయింట్మెంట్ కోసం బయటనే పడిగాపులు కాచేవాళ్ళు అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ఫలితాలను చూస్తుంటే బాధ కలుగుతుందని, అసలు అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండా ఓటేశారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రతిరోజు ఇంటింటికి తిరిగి జనాల కష్టాలు తెలుసుకున్నానని, చేతనైన ఎంత సాయం చేశానని పేర్కొన్నారు.

ఎంత పని చేసినా ప్రజలు ఆదరించలేదు
ప్రజల సంక్షేమం కోసం అధికారులను పరుగులు పెట్టించారని, అయినా ప్రజలు తమను ఎందుకు ఆదరించలేదో అర్థం కావడం లేదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, ఎన్నికలలో పక్కాగా వైసిపి గెలుస్తుంది అని భావించిన 80 నియోజకవర్గాలలో వైసిపి ఓటమి పాలైందని పేర్కొన్నారు.

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అనుమానం
అంతేకాదు ఎలక్షన్ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ముందుగానే వైసిపికి 15 కన్నా ఎక్కువ సీట్లు రావని చెప్పాడని గుర్తు చేశారు. టిడిపి కూటమికి 160 సీట్లు వస్తాయని చెప్పారన్నారు. కెకె సర్వే కూటమికి 160 సీట్లు వస్తాయని తెలిపిందని, ఎంపిక చేసుకున్న ప్రదేశాలలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానాలున్నాయని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+