హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్.... కీలక నేత గుడ్ బై
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు పంపించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని శాసనమండలి చైర్మన్‌ను కోరారాయన. గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత మహమ్మద్ ఇక్బాల్‌కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
గడిచిన నాలుగేళ్లుగా మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం ఇంచార్జ్ గా కొనసాగారు. ఇక్బాల్‌ను హిందూపురం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఆయన స్థానంలో దీపికను ఇంచార్జ్‌గా నియమంచారు. హిందూపురం అభ్యర్థిగా కూడా దీపిక పేరునే వైసీపీ అధిష్టానం ఖారారు చేశారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మహమ్మద్ ఇక్బాల్‌ను వైసీపీ పూర్తిగా దూరం పెట్టేయడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పైగా ఇక్బాల్‌కు పార్టీ కార్యక్రమాలకు పిలుపు రావడం లేదని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ తమను నిర్లక్ష్యం చేసినందుకే.. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారని అనుచరులు చెబుతున్నారు. హిందూపురం వైసీపీలో మొదటి నుంచి కూడా వర్గపోరు అధికంగా కనిపించేది. దీనికి తోడు కార్యకర్తను సొంత పార్టీకి చెందిన వారే హత్య చేయడంతో అధిపత్యపోరు తీవ్రతరం అయిందని గుర్తించిన వైసీపీ అధిష్టానం..ఇంఛార్జ్‌గా ఉన్న మహమ్మద్ ఇక్బాల్‌ను తప్పించి ఆయన స్థానంలో దీపికను నియమించింది.
వైసీపీకి ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ రాజీనామా..!#ShaikMohammedIqbal #MLC #YSRCP #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/okswciR7zV
— oneindiatelugu (@oneindiatelugu) April 5, 2024
దీపిక బీసీ మహిళ కావడం.. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రెండు సామాజికవర్గాలు కలసి వస్తాయన్న అంచనాతో దీపికను అభ్యర్థిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తనకు టికెట్ దక్కకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన మహమ్మద్ ఇక్బాల్ తన ఎమ్మెల్సీ పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications