బంగ్లా ప్రధానికి మోడీ ఏపీ చేనేత కళాఖండం గిఫ్ట్
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఒక చేనత వస్త్ర కళాఖండాన్ని బహూకరించారు. దీనిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన జాతీయ పురస్కార గ్రహీత గౌరబత్తిని రమణయ్య చేశారు.
నూలు, బంగారు జరీతో జమ్ దానీ శైలిలో దీనిని రూపొందించారు. ఈ వస్త్ర కళాఖండంతో పాటు హసీనాకు ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1972లో కోల్‌కతాలో ఇచ్చిన ప్రసంగం అరుదైన ఆడియో రికార్డును కూడా మోడీ అందజేశారు.

భారత్ - బంగ్లాదేశ్ భూసరిహద్దు ఒప్పందాన్ని భారత పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంగా పార్లమెంటులో జరిగిన చర్చలకు సంబంధించిన డీవీడీని కూడా ఇచ్చారు. ప్రతిగా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అనంతరం పాక్ సైన్యాల లొంగుబాటుకు సంబంధించిన ఫోటోను మోడీకి హసీనా ఇచ్చారు.












Click it and Unblock the Notifications