తెలంగాణ ఆడబిడ్డ కోడలుగా వచ్చి సేవ: మహిళా సర్పంచ్‌ను ప్రశంసించిన మోహన్‌బాబు

చిత్తూరు: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ మహిళను ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోడలుగా వచ్చి సర్పంచ్‌గా ఎన్నికై సేవ చేస్తున్నారని ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభా నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటలా పద్మజను ఆయన ప్రశంసించారు.

సోమవారం రామిరెడ్డిపల్లిలో నిర్వహించిన జల్లికట్టు ప్రదర్శనకు మోహన్ బాబు తన కుమారుడైన యువ హీరో మంచు మనోజ్, స్థానిక శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డిలతో కలిసి హాజరయ్యారు. గ్రామ ప్రజలతో కలిసి ఆయన జల్లికట్టు ప్రదర్శనను తిలకించారు.

 Mohan Babu praises woman sarpanch

తనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఆయన అంటూ ఆవులను, జంతువులను హింసించరాదనేది తన సిద్ధాంతమని చెప్పారు. పశువులను హింసించకుండా తరతరాలుగా వస్తున్న జల్లికట్టు క్రీడను నిర్వహించడాన్ని తప్పు పట్టరాదని ఆయన అభిప్రాయపడ్డారు. సర్పంచ్ పద్మజను ఆయన అభినందించారు

పశువులను హింసించకుండా సంప్రదాయబద్దంగా జల్లికట్టు నిర్వహించుకోవచ్చునని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తమ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చిన మోహన్ బాబు, మంచు మనోజ్, చెవిరెడ్డి భాస్కర రెడ్డిలకు సర్పంచ్ పద్మజ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+