మనీ లాండరింగ్: సిబిఐ కోర్టుకు హాజరైన వైయస్ జగన్

హైదరాబాద్: క్విడ్ ప్రో కో పెట్టుబడుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్ిడ బుధవారంనాడు సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. విచారణ జులై 24వ తేదీకి వాయిదా వడింది.

జగన్‌తో పాటు ఆయన అనుచరుడు, ఆర్థిక సలహాదారు విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరణ, తదితర నిందితులు కూడా కోర్టుకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన వివధ అంశాలపై వారు కోర్టుకు హాజరయ్యారు.

Money laundering: Jagan appears before CBI court

జగన్‌కు చెందిన కంపెనీల్లో పలువురు వ్యక్తులు, కంపెనీలు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టాయి. ఇందులో క్రిడ్ ప్రోకో చోటు చేసుకుందనే ఆరోపణలపై కేసు నడుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినవారు అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా జగన్ తన కంపెనీల్లోకి పెట్టుబడులను తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+