జగన్‌కు ఇంటి తిండి నో: మోపిదేవికి తాత్కాలిక బెయిల్

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉంటున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఊరట లభించింది. ఆరోగ్య కారణాలపై ఆయనకు కోర్టు 45 రోజుల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. చికిత్స నిమిత్తం అక్టోబర్ 31వ తేదీ వరకు మోపిదేవికి షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.
పూర్తి సమయాన్ని వైద్యచికిత్సకు మాత్రమే వాడుకోవాలని, ఇతరత్రా వ్యవహారాలకు వాడకూడదని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల సంతకాలతో కూడిన పూచీకత్తును, లక్ష రూపాయల జమానతును సమర్పించాలని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. బెయిల్ కాలంలో సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు సూచించింది. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని కూడా కోర్టు ఆయనను ఆదేశించింది.
మోపిదేవి వెన్నునొప్పి, రక్తంపోటుతో బాధపడుతున్నారని చెబుతూ చికిత్స నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్‌పై ఐదు రోజుల పాటు వాదప్రతివాదనలు జరిగాయి. మోపిదేవి వెంకటరమణ ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. ఆయన జగన్ ఆస్తుల కేసులోని వాన్‌పిక్ వ్యవహారంలో సిబిఐ చేతిలో అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications