రైలు పట్టాలపై కూర్చుని తల్లీకూతుళ్ల ఆత్మహత్య

భువనగిరి, జగదేవ్‌పూర్ గేట వద్ద విశాఖపట్నం నుంచి ముంబై వెళ్లే రైలు కింద పడి వారు మరణించారు. ఈ ఘటనలో వనజ ప్రాణాలతో బయటపడింది. ఇంట్లో గొడవ పడి తమ తల్లి వనజమ్మ (40), చెలెళ్లు పూజ (6), మౌనిక (3), తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వచ్చినట్లు వనజ తెలిపిందని ఓ వార్తాకథనం వచ్చింది.
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం - సోమవారంనాడు అందరూ భువనగిరి చేరుకుని సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కూర్చున్నారు. రైలు వచ్చే సమయానికి తల్లి తనను బయటకు నెట్టేసిందని వనజ చెప్పింది. తాను నాలుగో తరగతి చదువుతున్నానని, తండ్రి చనిపోయాడని, ఇంట్లో మామయ్యలతో గొడవ పెట్టుకుని వచ్చేశామని చెప్పింది. తమది చేగూరులోని ఎంకమ్మగూడెం అని తెలిపింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాలమూరు జిల్లాలో దంపతుల మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్టగ్రామంలో దారుణం జరిగింది. పెన్షన్ రాలేదన్న బెంగతో వృద్ధదంపతులు మృతి చెందారు. హరిజన్ చిన్నదేవన్న, కురమక్క దంపతులు పెన్షన్ కోసం అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగారు. వృద్ధ దంపతులమైన తమకు ఏ ఆధారమూ లేదని ప్రభుత్వం ఇచ్చే పెన్షనే ఆధారమని అధికారులకు విన్నవించారు.
అయినప్పటికీ పెన్షన్ జాబితాలో పేరు రాకపోవడంతో బెంగతో చిన్న దేవన్న ప్రాణాలు వదిలారు. భర్త మరణాన్ని తట్టుకోలేక కురమక్క గుండెపోటుతో మృతి చెందింది. భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications