బేబీ బంప్‌తో ఉపాసన కొణిదెల: మెగాస్టార్ ఇంట సందడి
అమరావతి/హైదరాబాద్: నేడు మాతృ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని పురస్కరించుకుని మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల బేబీ బంప్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె గర్భంతో ఉన్నారు. కిందటి నెల 23వ తేదీన బేబీ షవర్‌ను నిర్వహించారు కుటుంబ సభ్యులు.
ఇప్పుడు తాజాగా మాతృ దినోత్సవం సందర్భంగా బేబీ బంప్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. యోగా చేసేటప్పుడు ధరించే టీ షర్ట్, ప్యాంట్‌తో కనిపించారు ఉపాసన. ఇది తనకు మొట్టమొదటి మాతృ దినోత్సవం అంటూ రాసుకొచ్చారు. మాతృత్వాన్ని పొందడాన్ని గర్విస్తోన్నానని వ్యాఖ్యానించారు. పుట్టబోయే బిడ్డకు అందరి ప్రేమ దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను కోరుకున్నప్పుడే మాతృత్వాన్ని పొందగలుగుతున్నానని పేర్కొన్నారు.

2012 జూన్ 14వ తేదీన రామ్ చరణ్-ఉపాసన కొణిదెల వివాహం జరిగింది. 12 సంవత్సరాల తరువాత ఉపాసన గర్భం దాల్చారు. సమాజం ఏమనుకుంటుందో అనే కారణంతో కాకుండా తాను కోరుకున్నప్పుడే మాతృత్వాన్ని పొందగలిగానని, అది తనకు గర్వంగా ఉందని ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనో లేదా వివాహ బంధాన్ని మరింత బలోపేతం చేయాలనే కోరికతోనో తల్లి కావాలనే నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పారు.
పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోసం అందరి నుంచి ప్రేమ, సంరక్షణను అందించడానికి మానసికంగా సిద్ధమైనప్పుడు మాత్రమే తాను బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాను ఉపాసన వివరించారు. ఇవ్వాళ తన మొట్టమొదటి మదర్స్‌డేని ఉత్సాహంగా జరుపుకుంటోన్నానంటూ కామెంట్స్ పెట్టారు. ఈ పోస్ట్‌కు నటులు సమంత, కాజల అగర్వాల్, శ్రీయా శరణ్ రిప్లై ఇచ్చారు. హ్యాపీ మదర్స్ డే, బ్యూటిఫుల్ అంటూ సమంత కామెంట్ చేశారు. హ్యాపీ మదర్స్ డే లవ్లీ మమ్మీ అంటూ కాజల్ అగర్వాల్ రిప్లై ఇచ్చారు.
కిందటి నెల 23వ తేదీన ఉపాసనకు కుటుంబ సభ్యులు బేబీ షవర్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఆడబిడ్డ పుట్టాలని తాను కోరుకుంటోన్నట్లు రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆడపిల్లే పుడుతుందనే అర్థం వచ్చేలా గతంలో సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారాయన.












Click it and Unblock the Notifications