నిజమే కానీ కెసిఆర్ తప్ప, జగన్‌ని దొంగగా: మోత్కుపల్లి

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ చెప్పింది నిజమేనని... తెలంగాణ ఏర్పాటు ఆపే శక్తి ఎవరికీ లేదని, ఆ శక్తి ఆయనకు ఒక్కడికే ఉందని ఎద్దేవా చేశారు. కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసేదాకా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేలా కనిపించడం లేదన్నారు.

కెసిఆర్ వెంటనే తన పార్టీని కాంగ్రసులో విలీనం చేస్తే సోనియా పచ్చజెండా ఊపుతారన్నారు. కెసిఆర్ వల్ల వచ్చిన తెలంగాణ ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ఆగిపోతే ఇక్కడి ప్రజలు కెసిఆర్ భరతం పడతారన్నారు. కెసిఆర్ విలీనం కోసం వెయ్యి కోట్లను, ముఖ్యమంత్రి పదవిని అడుగుతున్నట్లుగా తెలుస్తోందన్నారు. ఆయన సోనియాతో ఏ చీకటి ఒప్పందాలు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ వస్తే అంతే చాలన్నారు.

కెసిఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డిని ఎందుకు కలిశారని, సోనియాతో ఈయనకు గల ఒప్పందాన్ని జానా రెడ్డి అమలు చేయగలరా అని ప్రశ్నించారు. విలీనం చేస్తే తప్ప అమ్మ పలికే పరిస్థితి లేదన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం కెసిఆర్ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సిడబ్ల్యూసి ప్రకటన చేసి ఇన్నాళ్లవుతున్నా తెలంగాణ ఇంకా ఎందుకు రాలేదో కెసిఆరే చెప్పాలన్నారు. కెసిఆర్ కుటుంబం మొత్తం డ్రామా చేస్తోందన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాకుండా తన కుటుంబ పునర్నిర్మాణం కోసం కెసిఆర్ ఆరాటపడుతున్నారన్నారు. కెసిఆర్‌ను తెలంగాణ జాతిపిత అంటున్నారని, ఆయన ఏం త్యాగం చేశారని జాతిపిత అవుతారన్నారు. కెసిఆర్ తెలంగాణ జాతిపిత అయితే కొడుకు జాతి కొడుకు, అల్లుడు జాతి అల్లుడు, కూతురు జాతి కూతురు అని ఎద్దేవా చేశారు. ఇవేనా మీ త్యాగాలు అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది కెసిఆర్ కుటుంబమే అన్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, సమయం లేదని, కాబట్టి కెసిఆర్ త్వరగా విలీనం చేయాలన్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పడాలంటే కెసిఆర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే ఆయనను విజయనగరం దాకా తరిమి కొడతామన్నారు. తెలంగాణ వస్తే తాను వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని కెసిఆర్ భయపడుతున్నారన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్ల కోసం ఆయన డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

జగన్‌ను దొంగగానే చూస్తున్నారు

వైయస్ జగన్‌ను ఎవరు కూడా నాయకుడిగా చూడటం లేదని, అందరూ దొంగగానే చూస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. జగన్ మాటలు వినేందుకు, నమ్మేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రపతిని జగన్ కలవడం భారత జాతికే అవమానమన్నారు. మనిషిని మనిషిగా చూడలేని క్రూర జంతువు జగన్ అన్నారు. సమైక్య దీక్ష చేసిన జగన్ తెల్లారేదాకా ఇంట్లో, పొద్దెక్కేదాకా టెంట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతిని కలిసేందుకు తాము అపాయింటుమెంట్ కోరామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+